Life Protection Plan: ప్రవాసీ కార్మికులకు శుభవార్త.. రూ. 17 లక్షల భీమా పథకం అమలు..
ABN, Publish Date - Mar 05 , 2024 | 10:30 PM
UAE Indian Consulate: దుబాయ్‌తో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని(UAE) వివిధ ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల(Indian Migrants) సంక్షేమార్ధం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్.పి.పి)(LPP) అనే వినూత్న భీమా పథకాన్ని దుబాయిలోని భారతీయ కాన్సులేట్(Indian Consulate) ప్రకటించింది. యుఏఇ తో సహా ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కేవలం రోడ్డు, వృత్తిపరమైన ప్రమాదాల కొరకు మాత్రమే భీమా పథకం అమలులో ఉండడంతో..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: దుబాయ్‌తో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని(UAE) వివిధ ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల(Indian Migrants) సంక్షేమార్ధం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్.పి.పి)(LPP) అనే వినూత్న భీమా పథకాన్ని దుబాయిలోని భారతీయ కాన్సులేట్(Indian Consulate) ప్రకటించింది. యుఏఇ తో సహా ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కేవలం రోడ్డు, వృత్తిపరమైన ప్రమాదాల కొరకు మాత్రమే భీమా పథకం అమలులో ఉండడంతో సహజ మరణాలతో కుటుంబ దిక్కును కోల్పోయే ప్రవాసీయుల కుటుంబాలకు నయా పైసా సహాయం అందడం లేదు.
ఇక నుండి యుఏఇ లో ప్రమాదవశాత్తుతో పాటు సహాజ కారణాల వలన మరణించిన ప్రవాసీయులకు సుమారు రూ. 8 లక్షల నుండి రూ. 16 లక్షల వరకు చెల్లించె విధంగా ఎల్.పి.పి విధానాన్ని అమలు చేయనున్నట్లుగా భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ సివాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓరియంట్, గార్గష్ భీమా కంపెనీలు దీన్ని అమలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. యుఏఇలోని చట్టబద్ధ ఉపాధి వీసాపై ఉండి, 18 నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగిన భారతీయులు మూడు రకాల పాలసీలను పొందవచ్చు. వార్షిక ప్రీమియం రూ. 735 (37 దిర్హాంలు)కు సుమారు 8 లక్షల రుపాయాలు (35 వేల దిర్హాంలు), రూ. 1128 (50 దిర్హాంలు)కు సుమారు సుమారు 11.2 లక్షల రూపాయలు, రూ. 1625 (70 దిర్హాంలు)కు సుమారు 17 లక్షల రూపాయాలను పాలసీదారులు మరణిస్తే చెల్లిస్తారని కాన్సులేటు వివరించింది.
సెలువులపై భారతదేశంలో ఉన్నప్పుడు కూడ ఈ పాలసీ వర్తిస్తుందని కాన్సులేటు పేర్కొంది. మృతదేహాలు పంపించడానికి 12 వేల దిర్హాంలు (సుమారు 2.70 లక్షల రూపాయాలును కూడ చెల్లించె విధంగా పాలసీలో పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలలో దుబాయిలోని భారతీయ కాన్సులేటు 2,613 మరణాలను నమోదు చేయగా అందులో 90 శాతం మందిది సహాజ మరణమని తేలినట్లుగా కాన్సుల్ జనరల్ వెల్లడించారు. పాలసీకు సంబంధించి మరిన్ని వివరాల కొరకు 00971527172944 లేదా 00971526167787 నెంబర్ల పై భీమా కంపెనీలను సంప్రదించాలని కాన్సులేటు సూచించింది.
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం, స్థానిక యుఏఇ ప్రభుత్వం కూడ ప్రమాద మృత్యు భీమా పథకం అమలు చేస్తున్నా.. దాని వలన ఎవరికి పెద్దగా ప్రయోజనం జరుగలేదని, ఈ నూతన విధానం వలన పేదలకు ప్రయోజనం జరుగుతుందని తెలుగు తరంగిణి అధ్యక్షుడు వెంకట సురేశ్ అన్నారు. వీసా గడువు ముగియడం, సహాజ మరణాలకు పాలసీలో ఆవకాశం లేకపోవడంతో పేద తెలుగు కార్మికులకు గతంలో భీమా పథకం అందని ద్రాక్షగా ఉండేదని గల్ఫ్ తెలంగాణ ప్రవాసీ సంఘం జి.డబ్ల్యూ.సి.ఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జువ్వాడి శ్రీనివాస రావు, సలాఓద్దీన్ లు వ్యాఖ్యానించారు.
మరిన్ని ప్రవాస వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 05 , 2024 | 10:31 PM