ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: అంజయ్య చౌదరితో యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం

ABN, Publish Date - May 29 , 2024 | 09:06 AM

తెలుగు అసోసియేషన్- యూఏఈ కార్యనిర్వాహక సభ్యులు దుబాయ్ లోని ఇండియన్ క్లబ్ నందు తానా....

తెలుగు అసోసియేషన్- యూఏఈ కార్యనిర్వాహక సభ్యులు దుబాయ్ లోని ఇండియన్ క్లబ్ నందు తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

అంజయ్య చౌదరి లావు గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో తానాలో వివిధ కీలక పదవులలో బాధ్యతలు నిర్వహించి విశేషమైన సేవలందించారు, వారి అకుంఠిత సేవా తత్పరత , దార్శనికత ,నాయకత్వ లక్షణాలు వారిని తానాలో అత్యంత ప్రతిష్టాకరమైన ఎమర్జెన్సీ సర్వీస్ టీం ఐన తానా టీం స్క్వేర్ నుండి అత్యంత కీలకమైన పదవి ఐన అధ్యక్ష పదవి వరకు సేవలందించే అవకాశం దక్కించుకున్నారు. వీరి నాయకత్వంలో తానా కేర్స్ మరియు తానా టీం స్క్వేర్ ద్వారా వందల కొలది విపత్కర పరిస్థితులలో ఉత్తర అమెరికాలోని తెలుగు వారికి సహాయ సహకారములు అందించారు.

అంజయ్య చౌదరి లావు తానా సంస్థ గత నాలుగు దశాబ్దలుగా అమెరికాలోని తెలుగు వారికి అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా సుదీర్ఘ కాలంగా సేవలందించడానికి ప్రధాన కారణమైన సంస్థాగత నిర్మాణం , వివిధ విభాగాల రూప కల్పన, కార్యక్రమాల నిర్వహణా విధానాలు , బోర్డు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీల పరస్పర సహకారములు , నిధుల సేకరణ వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా వివరించారు . తెలుగు అసోసియేషన్ ప్రస్తుత మరియు పూర్వ కార్యనిర్వాహక సభ్యులు తెలుగు అసోసియేషన్ యూఏఈ ఆవిర్భావం నుండి నేటివరకు నిర్వహించిన సాంస్క్రితిక, సామాజిక , సేవా కార్యక్రమాలను వివరించారు . అంజయ్య చౌదరి లావు తెలుగు అసోసియేషన్ యూఏఈ ప్రారంభించిన కొద్ది సంవత్సరాలలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించటం ఎంతో సంతోషించదగిన విషయమని తెలియచేస్తూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలతో యూఏఈ లోని తెలుగు వారికి సేవలందించాలి అని తానా తరుపున శుభాకాంక్షలు తెలియచేసారు.

ఈనాటి ఆత్మీయ సమ్మేళానికి చొరవ తీసుకున్న యూఏఈ తెలుగు అసోసియేషన్ వారిని అభినందిస్తూ , ఇటువంటి సమ్మేళనాలు మున్ముందు కూడా చేపట్టాలని , తద్వారా తానా మరియు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు సంఘాలు పరస్పర సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తెలుగు వారికి మరింత సేవా కార్యక్రమాలు చేసే అవకాశం దొరుకుతుంది అని ఈ సందర్భంగా తెలియచేసారు.

అంజయ్య చౌదరి లావు.. తానా మరియు ఇతర తెలుగు సంఘాలు అమెరికాలోని తెలుగు వారికి అందిస్తున్న సేవా కార్యక్రమాలు యూఏఈ తెలుగు అసోసియేషన్ కి ఎంతో స్ఫూర్తిదాయకం కాగలవని ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు ఆకాంక్షిస్తూ యూఏఈ తెలుగు అసోసియేషన్ తరుపున శ్రీ అంజయ్య చౌదరి లావుని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి యూఏఈ తెలుగు అసోసియేషన్ తరుపున ప్రస్తుత కార్య నిర్వాహక చైర్మన్ వివేకానంద్ బలుస , ప్రెసిడెంట్ మసివుద్దీన్, జనరల్ సెక్రటరీ విజయ భాస్కర్ , ట్రెజరర్ శ్రీనివాస్ గౌడ్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల, ఆంధ్రా సంక్షేమ విభాగ డైరెక్టర్ శ్రీధర్, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ భీం శంకర్ బంగారి, తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ చైతన్య చకినాల , పూర్వ కార్యనిర్వాహక బృందం నుండి చైర్మన్ దినేష్ కుమార్ ఉగ్గిన ,ట్రెజరర్ మురళి కృష్ణ నూకల , తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ షేక్ షా వలి విచ్చేసారు. వీరితో పాటు ఫారెస్ట్ నేషన్ ఎండి శరత్ నల్లమోతు ఈ కార్యక్రమానికి విచ్చేసారు

Updated Date - May 29 , 2024 | 09:19 AM

Advertising
Advertising