Vijayawada: 72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం
ABN, Publish Date - Sep 29 , 2024 | 08:00 AM
విజయవాడ: నగరంలోని లేబరు కాలనీ మైదానంలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలోని 72 అడుగుల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. శనివారం నిమజ్జనం చేశారు. ఈ భారీ గణనాథునికి నివేదించిన లడ్డూ రికార్డు స్థాయిలో రూ.16 లక్షలు పలికింది. కామకోటినగర్‌కు చెందిన నక్కా బాలాజీ అనే వ్యక్తి వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నారు.

విజయవాడ, లేబరు కాలనీ మైదానంలో 72 అడుగుల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించిన డూండీ గణేష్ సేవా సమితి..

వేలంలో రూ.16 లక్షలు పలికిన గణపతి లడ్డూను తీసుకువెళుతున్న భక్తులు..
72 అడుగుల భారీ మహా గణపతికి గుమ్మడికాయతో దిష్టి తీస్తున్న భక్తులు..
మహా గణపతికి హారతి ఇస్తున్న మహిళా భక్తులు..
72 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనానికి భారీగా తరలి వచ్చిన వేలాదిమంది భక్తులు..
Updated Date - Sep 29 , 2024 | 08:00 AM