విశాఖ: మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఈవో సుజాత అభిషేకాలతో పూజలు ప్రారంభించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.