రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున గోదావరి పుష్కరఘాట్‌లో భక్తులు పుణ్య స్నానాలు చేసి.. నదిలో దీపాలు వదులుతున్నారు. అనంతరం అక్కడున్న శివాలయానికి వెళ్లి శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయం మార్మోగుతోంది. కార్తీక పౌర్ణిమి సందర్భంగా లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం.