ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు..

ABN, Publish Date - Nov 06 , 2024 | 12:13 PM

అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాగులచవితి పండుగను ప్రజలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. భక్తులు వేకువ వజామునే లేచి పవిత్రస్నానాలను ఆచరించిన అనంతరం పొలాల్లో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి పుట్టను పరిశుభ్రం చేసి, చుట్టూ ముగ్గులు వేసి, రంగురంగుల పువ్వులతో అందంగా అలంక రించారు. అనంతరం పుట్ట కలుగుల్లో పాలు, గుడ్లు, చలిమిడి, చిమ్నీ, వడపప్పు, పసుపు, కుంకుమలు వేసి పూజలు చేశారు. ఆపై పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, చిన్నారులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

1/7

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాగులచవితి పండుగను ప్రజలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు..

2/7

నాగుల చవితి సందర్భంగా దేవాలయాలలో పుట్టలో పాలు పోస్తున్న భక్తులు..

3/7

కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద పుట్టలో పాలు, గుడ్లు, ప్రసాదాలు వేస్తున్న భక్తులు..

4/7

పుట్టలో పాలు పోసిన అనంతరం నాగదేవత గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు..

5/7

తమ కోర్కెలు నెరవేర్చాలంటూ భక్తులు నాగ దేవతను మొక్కుకుంటున్న దృశ్యం...

6/7

నాగుల చవితి సందర్భంగా శ్రీకాకుళంలో భక్తులు పుట్టలో పాలు పోస్తూ పూజలు చేస్తున్న భక్తులు..

7/7

ఒంగోలులో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు...

Updated Date - Nov 06 , 2024 | 12:13 PM