Union Budget 2024: వీటి ధరలు తగ్గుతాయి.. వీటి ధరలు పెరుగుతాయి.
ABN, Publish Date - Jul 23 , 2024 | 05:05 PM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు చౌకగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులు మాత్రం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మరింత ప్రియం కానున్నాయి. క్యాన్సర్ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై సుంకాన్ని భారీగా తగ్గించింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇక దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినం, మొబైల్స్, తోలుతో తయారు చేసిన వస్తువులు, సముద్రపు ఆహార పదార్ధాల ధరలు సైతం చౌకగా మారనున్నాయి. అయితే అమ్మోనియం నైట్రేట్‌పై 10 శాతం, బయోడిగ్రేడబుల్ సాధ్యం కానీ ప్లాస్టిక్‌పై 25 శాతం మేర కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. టెలికాం పరికరాల ధరలు సైతం భారీగా పెరగనున్నాయి.
Updated Date - Jul 23 , 2024 | 05:08 PM