వచ్చేస్తున్నాయ్.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలివే
ABN , Publish Date - Sep 02 , 2024 | 01:44 PM
వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు.
వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు.
ఈ రైలు మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. రైలులో మొత్తం 16 బోగీలు(823 బెర్తులు) ఉంటాయని చెప్పారు. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని ఈ రైలును రూపొందిస్తున్నారని, టికెట్ రేట్లు రాజధాని ఎక్స్‌ప్రెస్ స్థాయిలో ఉంటాయని మంత్రి వివరించారు.
వందే భారత్ స్లీపర్ వెర్షన్‌లో యుఎస్‌బీ ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ఇన్‌సైడ్ డిస్‌ప్లే ప్యానెల్‌లు, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు వంటి అనేక ఫీచర్లున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలు సెట్ స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రయాణికులకు భద్రతను పెంచడానికి మరిన్ని ఫీచర్లను జోడించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ బఫర్‌లు, కప్లర్‌ల వంటి అధునాతన క్రాష్‌వర్తీ ఎలిమెంట్లు ఉంటాయి. తీవ్రమైన అగ్నిప్రమాదాలను కూడా తట్టుకునేలా దీన్ని రూపొందించారు.
స్లీపర్ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. ఇందులో 11 ఏసీ త్రి టైర్ కోచుల్లో 611 బెర్తులు, 4 ఏసీ టూ టైర్ కోచుల్లో 188 బెర్తులు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. వందేభారత్ స్లీపర్ కోచ్ మరింతగా అప్‌గ్రేడ్ అవుతోంది. ఆటోమేటిక్ ఎక్సీటీరయర్ డోర్స్, సెన్సార్ ఆధారంగా పనిచేసే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్స్, రిమోట్‌తో పనిచేసే ఫైర్ బారియర్ డోర్లు, ఎర్గోనామిక్‌గా డిజైన్ ఉన్న వాసన రాని టాయిలెట్ సిస్టమ్, డ్రైవింగ్ సిబ్బంది కోసం మరుగుదొడ్ల సౌకర్యాలు ఉన్నాయి.
ఇంటీరియర్స్ ప్యానెల్స్, సీట్లు, బెర్తులు అన్ని సరికొత్తగా కనువిందు చేస్తాయి. BEML ఎలక్ట్రికల్, ప్రొపల్షన్, బోగీలు, ఎక్స్‌టీరియర్ ప్లగ్ డోర్లు, బ్రేక్ సిస్టమ్‌లు, HVAC సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. ఈ రైలు గంటకుకు 160 కి.మీ వేగంతో పరుగు తీస్తుంది.
Updated Date - Sep 02 , 2024 | 01:51 PM