హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలు కూకట్‌పల్లిలో రెండు రోజుల ముందే ప్రారంభమయ్యాయి. మంగళ, బుధవారాల్లో అమావాస్య తిధి ఉండడంతో సోమవారం కూకట్ పల్లి హనుమాన్ టెంపుల్ వద్ద సంబరాలను ప్రారంభించారు. తీరొక్కపూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. ఈ సంబరాల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.