రామోజీరావుకు ప్రముఖుల నివాళి..
ABN, Publish Date - Jun 09 , 2024 | 12:43 PM
హైదరాబాద్: ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు నానాక్‌రాంగూడలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో రామోజీరావు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఆయన శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం కుటుంబసభ్యులు ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు.
ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.
రామోజీరావు కుమారుడు కిరణ్ దంపతులను ఓదారుస్తున్న చంద్రబాబు దంపతులు..
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. రామోజీరావు సతీమణి రమాదేవికి నమస్కరిస్తున్న దృశ్యం..
రామోజీరావు పార్ధివదేహానికి నివాళులర్పిస్తున్న మాజీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
రామోజీరావు పార్ధివదేహానికి పుష్పగుచ్ఛములతో నివాళులర్పిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
మెగాస్టార్ చిరంజీవి.. రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛములతో నివాళులర్పిస్తున్న దృశ్యం.
రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛములతో నివాళులర్పిస్తున్న దృశ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్
సుప్రీంకోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న దృశ్యం.
Updated Date - Jun 09 , 2024 | 12:43 PM