హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ కొలువుల కోలాహలం నెలకొంది. దసరా తర్వాత కొత్త టీచర్లు విధుల్లోకి చేరనున్నారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినందున హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్కు బయలుదేరి వస్తున్నారు.