ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:48 PM

కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరీ సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం జరిగింది. వివిధ పార్టీల నేతలు సంస్మరణ సభకు హాజరయ్యారు. సీతారాం ఏచూరి సేవలను స్మరించుకున్నారు.

1/6

కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరీ సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం జరిగింది. వివిధ పార్టీల నేతలు సంస్మరణ సభకు హాజరయ్యారు. సీతారాం ఏచూరి సేవలను స్మరించుకున్నారు.

2/6

సమావేశంలో పాల్గొన్న వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం, సీపీఎం బీవీ రాఘవులు తదితరులు ఉన్నారు.

3/6

సభలో కేటీఆర్.. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరీతో తమ బంధం రక్త సంబంధం అని అన్నారు.

4/6

నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరీ జీవితం తమ లాంటి వారికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఫిరాయింపు రాజకీయాలు ఉన్న ఈ కాలంలో పదవుల కోసం కాకుండా.. సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప నాయకుడు ఏచూరీ అని కీర్తించారు.

5/6

తిట్లు, బూతులు చలామణి అవుతోన్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరీ రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని కేటీఆర్ అన్నారు.

6/6

కేటీఆర్ తన ప్రసంగం ముగిసిన వెంటనే సభ నుంచి తిరుగుపయనం అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యారు.

Updated Date - Sep 21 , 2024 | 02:48 PM