ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

ABN, Publish Date - Oct 10 , 2024 | 02:01 PM

బాదం తినే అలవాటు ఉన్నవారు బాదం పప్పును నానబెట్టి వాటి తొక్కలు తీసి లోపల పప్పును తిని, తొక్కలు పడేస్తుంటారు. బాదం పప్పు తొక్కలో పైటిక్ యాసిడ్ ఉంటుందని, అది తింటే ప్రమాదమని చెబుతారు. అయితే బాదం పప్పు తొక్కల వల్ల లాభాలు కూడా ఉంటాయట. నానబెట్టిన బాదం పప్పు తొక్కలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి.

1/5

బాదం పప్పు లాగే బాదం తొక్కలు కూడా ప్రయోజనాలు చేకూరుస్తాయి. బాదం తొక్కలలో కూడా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

2/5

హెయిర్ మాస్క్.. బాదం తొక్కలలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. బాదం తొక్కలను ఉపయోగించి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుుతుంది. బాదం తొక్కలను గ్రైండ్ చేసి అందులో తేనె, అలోవెరా జెల్, గుడ్డు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి తరువాత జుట్టు కడిగేయాలి.

3/5

చట్నీ.. బాదం తొక్కలతో చట్నీ చేసుకుని తినవచ్చని తెలుసా? బీర కాయ పొట్టు చట్నీ లాగా ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం బాదం తొక్కలు ఒక కప్పు, వేరుశనగలు ఒక కప్పు, మినపగుండ్లు, కాసింత నెయ్యి, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మరసం, తినాలని అనుకునే వారు వెల్లుల్లి మొదలైనవి జోడించి బాదం తొక్కల చట్నీ చేసుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

4/5

ఫేస్ ప్యాక్.. బాదం తొక్కలు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. బాదం తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. బాదం తొక్కలను పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవచ్చు. ఈ పేస్ట్ లో కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. 20 నిమిషాలు ముఖం మీద ఉంచి తరువాత ముఖం కడిగేయాలి.

5/5

టూత్ పౌడర్.. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి బాదం తొక్కల పొడితో టూత్ పౌడర్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇది పాతకాలపు ఆయుర్వేద నివారణ. బాదం తొక్కలను కాల్చి పొడి చేసి ఆ పొడితో దంతాలను శుభ్రం చేసుకోవాలి. దీంతో దంతాలు చాలా బాగా శుభ్రం అవుతాయి.

Updated Date - Oct 10 , 2024 | 02:01 PM