జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?
ABN , Publish Date - Oct 14 , 2024 | 03:58 PM
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పోషకాలు అవసరం అవుతాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్ లు మొదలైనవి ఉంటాయి. శరీరానికి అవసరమైన ఖనిజాలలో జంగ్ ప్రధానమైనది.
శరీర రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడం నుండి గాయాలను నయం చేయడం వరకు..కణాల పెరుగుదలను ప్రోత్సహించడం నుండి చాలా రకాల విధులు నిర్వర్తించడంలో జింక్ సహాయపడుతుంది.
సాధారణంగా జింక్ మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది. కానీ కొన్ని శాకాహార ఆహారాలలో కూడా జింక్ ఉంటుంది.
చిక్కుళ్లు..
శనగలు, కాయ ధాన్యాలు, బీన్స్ మొదలైనవాటిలో ప్రోటీన్స్ మాత్రమే కాకుండా జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. జింక్ శోషణ పెరగాలంటే బెల్ పెప్పర్, టమోటాలు, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
విత్తనాలు..
జనపనార, గుమ్మడి, నువ్వులు మొదలైనవాటిలో జింక్ సమృద్దిగా ఉంటుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండెను, మెదడును ఆరోగ్యంగాఉంచుతాయి.
నట్స్..
జీడిపప్పు, బాదం పప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియంతో పాటు జింక్ కూడా లభిస్తుంది.
పాలు, పాల ఉత్పత్తులు..
జున్ను, పాలు.. కాల్షియం ను మాత్రమే కాకుండా జింక్ ను కూడా అందిస్తాయి.
తృణధాన్యాలు..
క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ మొదలైన వాటిలో జింక్ సమృద్దిగా ఉంటుంది. జింక్ శోషణను నిరోధించే పైటేట్ లు ఇందులో ఉంటాయి. అందుకే ముందుగా వీటిని నానబెట్టి తరువాత ఆహారంలో తీసుకోవాలి.
Updated Date - Oct 14 , 2024 | 03:58 PM