ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..!

ABN, Publish Date - Sep 02 , 2024 | 10:48 AM

బట్టతల ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు మాత్రం చాలా మందిలో బట్టతల సమస్య కనిపిస్తోంది. ఆడవాళ్లు కూడా దీని బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే బట్టతల వచ్చిన వారు తిరిగి జుట్టు పొందడానికి నానా అవస్థ పడుతుంటారు.

1/7

జుట్టు విపరీతంగా రాలిపోవడం వల్ల, జుట్టు చాలా పలుచగా, సున్నితంగా మారడం వల్ల బట్టతల వస్తుంది. బట్టతల నివారణకు వైద్యులను సంప్రదించే ముందు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

2/7

ఉసిరి, నిమ్మరసం.. ఉసిరి, నిమ్మరసం రెండింటిని మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. దీని వల్ల హెయిర్ ఫోలికల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహకరిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని కూడా ఆపుతుంది

3/7

ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయ లో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత కడిగేయాలి. ఇది జుట్టు వాల్యూమ్ పెంచడంలో సహాయపడుతుంది. జుట్టు దృఢంగా మారుస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.

4/7

అలోవేరా జెల్.. అలోవేరా జెల్ ను తలకు పట్టించడం వల్ల తల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.

5/7

కొబ్బరినూనె, మెంతులు.. మెంతి గింజలను గ్రైండ్ చేయాలి. ఈ పొడిని కొబ్బరినూనె లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టౌ పైన సన్నని మంట మీద వేడి చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి.

6/7

గ్రీన్ టీ.. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీని జుట్టు మూలాలపై అప్లై చేసి 1 గంట పాటూ అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. జుట్టు రాలడం ఆగిపోతుంది.

7/7

ఆహారం.. ఆహారంలో ప్రోటీన్, విటమిన్-బి, జింక్, ఐరన్ ను బాగా తీసుకోవడం వల్ల జుట్టు మూలాలు బలోపేతం అవుతాయి. కొత్త జుట్టు పెరగడంలో సహాయపడుతుంది.

Updated Date - Sep 02 , 2024 | 10:48 AM

Advertising
Advertising