పియర్ పండ్లు తింటే.. ఈ సమస్యలన్నీ నయమవుతాయట..!
ABN , Publish Date - Sep 12 , 2024 | 06:44 PM
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక్కో రకానికి చెందిన పండులో ఒక్కోరకమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి వివిధ ప్రయోజనాలు చేకూరుస్తాయి. కొన్ని రకాల పండ్లు తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు, జబ్బులు కూడా నయమవుతాయి.
పియర్ పండ్లు తీసుకుంటే కొన్ని రకాల జబ్బులు నయమవుతాయని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.
పియర్ లో విటమిన్-సి, విటమిన్-కె, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
జీర్ణ సంబంధ సమస్యలు..
జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో పియర్ ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
బరువు..
పియర్ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తహీనత..
పియర్ పండ్లలో ఐరన్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు పియర్ ను తింటూ ఉంటే రక్తహీనత తగ్గుతుంది.
గుండె జబ్బులు..
పియర్ పండ్లు తింటూ ఉంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
డయాబెటిస్..
పియర్ పండ్లలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి.
క్యాన్సర్..
పియర్ లో యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
Updated Date - Sep 12 , 2024 | 06:47 PM