ఈ ఆహారాలు తీసుకోండి చాలు.. విటమిన్-డి లోపం మిమ్మల్ని టచ్ చేయదు..!
ABN , Publish Date - Sep 05 , 2024 | 11:30 AM
విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. లేత సూర్య కిరణాలు శరీరాన్ని తాకినప్పుడు శరీరంలో విటమిన్-డి తయారవుతుంది. వర్షాకాలంలో, చలికాలంలో సూర్యుని ఎండ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా విటమిన్-డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ.
వర్షాకాలంలో, చలికాలంలో సూర్యుని ఎండ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా విటమిన్-డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే కొన్ని ఆహారాలు తింటే విటమిన్-డి ని భర్తీ చేసుకోవచ్చు.
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలలో విటమిన్-డి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి.
బాదం లేదా సోయా మొదలైనవాటితో తయారయ్యే ప్లాంట్ బేస్డ్ మిల్క్ లో కూడా విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. పాలు తీసుకోలేని వారికి ఇవి మంచివి.
పెరుగులో విటమిన్-డి ఉంటుంది. ఇది గొప్ప ప్రోబయోటిక్.
తృణధాన్యాలలో విటమిన్-డి మాత్రమే కాకుండా పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి.
వోట్మీల్ లో విటమిన్-డి ఉంటుంది. రూజువారి అల్పాహారంలో వోట్మీల్ తీసుకుంటే శరీరానికి ఫైబర్ కూడా పుష్కలంగా అందుతుంది.
పనీర్ లో విటమిన్-డి ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ మిల్క్ నుండి కూడా పనీర్ తయారు చేస్తారు.
షిటేక్, మైటేక్ వంటి పుట్టగొడుగు రకాలలో విటమిన్-డి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పుట్టగొడుగులను కొద్దిసేపు ఎండలో ఉంచితే విటమిన్-డి మరింత మెరుగవుతుంది.
గుడ్డు పచ్చ సొనలో ప్రోటీన్, విటమిన్-డి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.
Updated Date - Sep 05 , 2024 | 11:30 AM