శరీరంలో ప్రోటీన్ తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఈ లక్షణాలతో చెక్ చేసుకోండి..!
ABN , Publish Date - Sep 30 , 2024 | 09:16 AM
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు.. ఇలా చాలా అవసరం అవుతాయి. ముఖ్యంగా ప్రోటీన్ శరీరం ఎదగడానికి చాలా అవసరం. ప్రోటీన్ లోపాన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు.
ప్రోటీన్ శరీరానికి చాలా అవసరమైన పదార్థం. శరీర ఎదుగుదలకు, కండరాల మరమ్మత్తుకు ప్రోటీన్ అవసరం.
ప్రోటీన్ లోపిస్తే చాలా తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శరీరంలో కండరాలు బలహీనంగా, అలసటగా అనిపిస్తూ ఉంటే అది ప్రోటీన్ లోపమే..
జుట్టు పెరుగుదలకు కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లోపిస్తే జుట్టు పలుచగా మారడం, విరగడం, జుట్టు రాలిపోవడం జరుగుతుంది.
ప్రోటీన్ లోపిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం పాలవుతుంటారు.
ప్రోటీన్ లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఎముకలు పగుళ్లు వచ్చి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రోటీన్ కోసం పాలు, పప్పులు, గుడ్లు, చేపలు, చికెన్, తృణధాన్యాలు పుష్కలంగా తీసుకోవాలి.
Updated Date - Sep 30 , 2024 | 09:16 AM