ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!

ABN, Publish Date - Oct 04 , 2024 | 05:12 PM

వాతావరణంలో చోటు చేసుకునే మార్పువు చాలా వరకు అనారోగ్యాలకు కారణం అవుతాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు ఆ సీజన్ లో తినడం మంచిదని పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ నేటి కాలం హైబ్రిడ్ పంటల కారణంగా సీజన్ లో దొరనివి కూడా కొన్ని మార్కెట్లలో లభిస్తుంటాయి. ఆహారం మీద ఇష్టం కొద్దీ కొన్ని పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి తింటారు.

1/9

శరదృతువులో వాతావరణం చాలా చల్గగా మారుతుంది. ఒకవైపు వర్షాలు.. మరొక వైపు చలి, చల్లని వాతావరణం కారణంగా సీజనల్ సమస్యలు కూడా వస్తాయి. సీజనల్ సమస్యలు రాకూడదంటే శరదృతువులో కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి.

2/9

గుమ్మడి కాయలు.. గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియకు మంచిది.

3/9

యాపిల్స్.. యాపిల్స్ లో ఫైబర్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మంటను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

4/9

చిలకడదుంపలు.. విటమిన్-ఎ, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చిలగడదుంపలు రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి.

5/9

బ్రెస్సెల్స్ మొలకలు.. బ్రెస్సెల్స్ మొలకలు ఫైబర్, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

6/9

బేరి పండ్లు.. బేరి పండ్లలో ఫైబర్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. సహజమైన తీపి వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా మంచివి.

7/9

క్రాన్బెర్రీస్.. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

8/9

దానిమ్మ.. దానిమ్మలో యాంటీ ఆక్సిడెటంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ధీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

9/9

అక్రోట్లు.. వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ లు తగ్గిస్తాయి. చల్లని వాతావరణంలో మెదడు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Updated Date - Oct 04 , 2024 | 05:12 PM