ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ 5 సమస్యలు ఉన్నవారు ముల్లంగిని అస్సలు తినకూడదు..!

ABN, Publish Date - Aug 07 , 2024 | 09:10 AM

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కూరగాయలు ఎంతగానో తోడ్పడతాయి. ఫైబర్, విటమిన్లు, నీటి శాతం వీటిలో సమృద్దిగా ఉంటాయి. అలాంటి కూరగాయలలో ముల్లంగి ఒకటి. మలబద్దకం, ఫైల్స్, మధుమేహం ఉన్నవారికి ముల్లంగి ఔషధంలా పనిచేస్తుంది. ముల్లంగిని తరచుగా ఆహారంలో తీసుకునేవారు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అయితే 5 రకాల సమస్యలు ఉన్నవారు ముల్లంగిని అస్సలు తీసుకోకూడదు అని వైద్యులు చెబుతున్నారు.

1/5

థైరాయిడ్:- థైరాయిడ్ సమస్య ఉన్నవారు ముల్లంగి తినకూడదు. ఇందులో థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్ అనే సమ్మేళనాలు ఉంటాయి.

2/5

జీర్ణ సమస్యలు:- ముల్లంగి జీర్ణ సమస్యలు తగ్గిస్తుందని చెబుతుంటారు. కానీ జీర్ణ సమస్యలు ఉన్నవారు ముల్లంగిని ఎక్కువ తింటే మాత్రం గ్యాస్ ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముల్లంగిలో ఉండే అధిక ఫైబర్ వల్ల ఇది జరుగుతుంది.

3/5

మూత్ర సమస్యలు:- ముల్లంగిని ఎక్కువ తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడాన్ని ప్రేరేపిస్తుంది.

4/5

లో బీపీ:- ముల్లంగి రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది. కానీ లో బీబీ ఉన్నవారు దీన్ని తీసుకుంటే రక్తపోటు ఇంకా తగ్గుతుంది. కాబట్టి లో బీపీ ఉన్నవారు దీన్ని తక్కువ తినాలి.

5/5

ఉబ్బసం, అలర్జీలు:- కొందరికి ముల్లంగి తింటే అలర్జీలు, చర్మం మీద దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.

Updated Date - Aug 07 , 2024 | 09:10 AM

Advertising
Advertising