ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..!
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:53 AM
ఆహారమే ఆరోగ్యం అంటారు. విదేశాలలో కొన్ని ఆహారాలను సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. ఈ కారణంగా అవి ఖరీదు అయినా భారతీయులు కూడా వాటిని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే ఫారిన్ ఆహారాలను తల దన్నే భారతీయ సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి.
ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ కూడా బలాదూర్ అవుతాయి. అవేంటంటే..
మునగ..
భారతదేశంలో మునగ విదేశీ సూపర్ ఫుడ్స్ ను తలదన్నే పోషకాలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్-ఎ, సి, ఇ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అమరాంత్ లేదా రాజ్ గిరా..
ఈ మధ్యన వైరల్ అవుతున్న విదేశీ ఫుడ్ క్వినోవాకు అమరాంత్ చాలా మంచి ప్రత్యామ్నాయం. వీటిలో ప్రోటీన్ పైబర్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి.
తులసి..
వైరల్ అవుతున్న ఫారిన్ మాచా టీ లాగానే తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఉసిరి..
ఫారిన్ బెర్రీ జాతి పండ్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. కానీ భారతీయ ఉసిరి వీటికి ధీటుగా నిలుస్తుంది. ఉసిరి విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్.
సబ్జా..
చియా సీడ్స్ కు సబ్జా విత్తనాలు మంచి ప్రత్యామ్నాయం. వీటిలో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
Updated Date - Aug 28 , 2024 | 11:54 AM