ఆయుర్వేదంలో అమృతంతో సమానమైన గుణాలు కలిగిన ఆహారాలు ఇవి..!
ABN , Publish Date - Aug 11 , 2024 | 12:27 PM
భారతదేశంలో ఆయుర్వేదాన్ని చాలా ప్రాచీన వైద్యంగా చెబుతారు. నిజానికి ఆయుర్వేదం, యోగా లు ప్రాచీన భారతీయుల జీవనశైలిగా పరిగణించబడ్డాయి. ఆయుర్వేదంలో కొన్ని ఆహారాలు అనారోగ్యంతో నిండిన శరీరానికి కొత్త ప్రాణం పోస్తాయి. ఇలాంటి ఆహారాలను ఆయుర్వేదం అమృతంతో సమానంగా పరిగణించింది. అంతేకాదు వీటిలో ఉన్న గుణాలను అమృత గుణాలు అంటారు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుని వాటిని ఆహారంలో తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
1/9
పసుపు:-
పసుపును గోల్డెన్ స్పైన్ అంటారు. ఆయుర్వేదంలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ఉండే కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్, శోథనిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.
2/9
అశ్వగంధ:-
అశ్వగంధ ఒత్తిడిని తగ్గించి, శరీరానికి శక్తి అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. యవ్వనంగా ఉంచుతుంది.
నెయ్యి:-
ఆయుర్వేదంలో ఆవు నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ నెయ్యి తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఆహారం నుండి పోషకాలు గ్రహించడంలో సహాయపడుతుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కీళ్ళలో గుజ్జు తిరిగి ఏర్పడేలా చేస్తుంది. మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది.తుంది.
ఉసిరి:-
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యానికి, జీవక్రియకు మంచిది. కాలేయం మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
తేనె:-
తేనె సహజమైన తీపి పదార్థం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది. దగ్గు, జలుబు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
నేరేడు:-
నేరేడు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహ రోగులకు మంచిది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
తులసి:-
తులసి ఒత్తిడిని ఎదుర్కోవడంలో, శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
తిప్పతీగ:-
తిప్పతీగ రక్తాన్ని శుద్ది చేయడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలో, దీర్ఘకాలిక జ్వరాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా తగ్గిస్తుంది. చాలా వ్యాధులలో దీన్ని ఉపయోగిస్తారు.
అల్లం:-
అల్లం వికారం తగ్గించి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. కండరాల నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే వేడి గుణాలు జలుబు, ఫ్లూ నయం చేయడంలో సహాయపడతాయి.
Updated Date - Aug 11 , 2024 | 12:33 PM