YS Jagan: వైఎస్ జగన్ నివాసం వద్ద రెండో రోజూ రచ్చ.. ఐదేళ్లలో చేసిందేంటి..!?
ABN, Publish Date - Jun 23 , 2024 | 04:57 PM
మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) సొంత పార్టీ శ్రేణుల నుంచి అడగడుగునా షాక్‌లు ఎదురవుతున్నాయి..
మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) సొంత పార్టీ శ్రేణుల నుంచి అడగడుగునా షాక్‌లు ఎదురవుతున్నాయి. మూడ్రోజుల పర్యటన నిమిత్తం జగన్ పులివెందులకు వెళ్లిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఎంత హడావుడి.. గొడవ జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇదే రచ్చ రెండో రోజూ కంటిన్యూ అయ్యింది. వైఎస్ జగన్ పులివెందులలోనే ఉన్నారని తెలుసుకున్న కార్యకర్తలు, వీరాభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజాసమస్యలపై జగన్ కలిసేందుకు భారీగా తరలివస్తున్న పరిస్థితి. అయితే.. జగన్‌ను కలవడానికి నేతలు, ద్వితియ శ్రేణి నేతలను మాత్రమే పంపిస్తున్న సెక్యూరిటీ.. కార్యకర్తలు, సాధారణ ప్రజలను మాత్రం లోపలికి పోనివ్వలేదు. దీంతో ఎక్కడ నుంచో తమ సమస్యలు తెలపడానికి వస్తే.. కనీసం జగన్‌ను కలవనీకపోవడం ఏంటి..? అని సామాన్యులు కన్నెర్రజేస్తున్నారు. సెక్యూరిటీ తీరుపై మండిపడుతూ.. వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో రెండోరోజూ ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ రంగ ప్రవేశం చేసి కార్యకర్తలు, నేతలకు చెదరగొట్టి, నచ్చచెప్పడంలో పరిస్థితులు అదుపులోనికి వచ్చాయి.
అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!
ఇన్నాళ్లు ఏం చేశారు..?
వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో ప్రజలు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తాజా పరిస్థితులను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అదెలాగంటే.. జగన్ రెండ్రోజులుగా పులివెందులలో పర్యటిస్తుండగా సమస్యలు చెప్పుకోవడానికి.. ఇదిగో ఫలానా సమస్య పరిష్కరించడని ఎవరి చేతిలో చూసినా దరఖాస్తులు, ఫిర్యాదులే ఉన్నాయి. ఐదేళ్లుగా రాష్ట్రానికి వైఎస్ జగన్ చేసిందేమీ లేదన్నది టీడీపీ కూటమి ప్రధాన ఆరోపణ. ఏం చేశారు..? ఏం చేయలేదన్నది అటుంచితే సొంత నియోజకవర్గానికి ఏం చేశారన్నది ఎవరికీ అంతుచిక్కట్లేదు. నిన్నటి నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి. దీంతో పులివెందులకు కూడా వైఎస్ జగన్ చేసింది గుండు సున్నానేనా..? అనే సందేహాలు వస్తున్న పరిస్థితి. అది కూడా సమస్యలు చెప్పుకోవడానికి వేల సంఖ్యలో వస్తుండటం, తొక్కిసలాట జరుగుతుండటం.. తీవ్ర ఆగ్రహానికి లోనై ఇంటి అద్దాలు కూడా పగులకొట్టడం గమనార్హం. మరి ఈ రెండ్రోజుల్లోనే పరిణామాలు ఇలా ఉంటే.. పులివెందుల ఎమ్మెల్యేగా ఈ ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజలకు ఏ మాత్రం న్యాయం చేసి.. సమస్యలు పరిష్కరిస్తారో మరి. అయితే అభిమానులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భేటీ అయిన నేతలకు చెబుతూ జగన్ ధైర్యం చెబుతున్నారు.
వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే
తొలి రోజు ఏం జరిగింది..?
కాగా.. తొలిరోజు మాత్రం సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే బిల్లుల కోసం జగన్‌ను నిలదీసినంత పనిచేశారు. బిల్లులు కాకపోతే ఆస్తులు అమ్మినా కూడా చేసిన అప్పులు తీరవని.. తాము ఎలా బతకాలి? ఎన్నికలకు ముందు నుంచి కూడా బిల్లుల కోసం అధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదంటూ జగన్ ముందు వాపోయారు. అందరూ సహనంతో ఉండాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని జగన్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో జగన్ ఇంటి కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక.. పులివెందులకు వెళ్లేసరికి అక్కడ జనం పెద్దగా లేరు. తర్వాత వైసీపీ నాయకులు భారీ స్థాయిలో జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేసి, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నవారంతా అక్కడకు వచ్చారు. ఈ కాంట్రాక్టర్లు, కార్యకర్తలకు వైఎస్ జగన్ ఏ మాత్రం న్యాయం చేస్తారో చూడాలి మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 23 , 2024 | 05:00 PM