మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: చంద్రబాబుపై మళ్లీ ఫేక్ ప్రచారానికి తెగబడిన వైసీపీ!

ABN, Publish Date - Feb 29 , 2024 | 02:34 PM

అవును.. వైసీపీ సోషల్ మీడియా ఆగడాలకు అడ్డు, అదుపులేకుండా పోతోంది. నిత్యం.. ఫేక్ న్యూస్.. ఫేక్ వీడియోలు చేయడంలోనే మునిగిపోతోంది. ఎన్నికల దగ్గరపడుతుండటంతో ఏదో ఒకలా టీడీపీని బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ సోషల్ మీడియాలో లేని పోని వార్తలు, వీడియోలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతోంది...

AP Elections 2024: చంద్రబాబుపై మళ్లీ ఫేక్ ప్రచారానికి తెగబడిన వైసీపీ!

అవును.. వైసీపీ సోషల్ మీడియా ఆగడాలకు అడ్డు, అదుపులేకుండా పోతోంది. నిత్యం.. ఫేక్ న్యూస్.. ఫేక్ వీడియోలు చేయడంలోనే మునిగిపోతోంది. ఎన్నికల దగ్గరపడుతుండటంతో ఏదో ఒకలా టీడీపీని బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ సోషల్ మీడియాలో లేని పోని వార్తలు, వీడియోలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా.. అంతకుమించి తిట్టినా సరే అబ్బే అవేమీ పట్టవన్నట్లుగా వైసీపీ సిగ్గు విడిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ-జనసేన కూటమికి వస్తున్న ఆదరణను ఓర్చుకోలేని వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ఫేక్ ప్రచారానికి తెరలేపింది. ఎంత దారుణం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగాన్ని మార్చి.. వారికి కావాల్సిన మాటలను కట్ చేసి ఇష్టానుసారం వైరల్ చేసేస్తున్నారు. తీరా టీడీపీ రియాక్ట్ అయ్యి.. లాగి కొట్టినట్లుగా రిప్లయ్, అంతకుమించి అదిరిపోయే కౌంటర్ ఇస్తే దెబ్బకు సోషల్ మీడియా నుంచి ఆ పోస్ట్‌ను డెలీట్ చేయడం వైసీపీకి పరిపాటిగా వస్తోంది.

AP Elections: ‘ఫ్యాను’ పార్టీ పాడుపని.. చీ.. ఛీ.. ఇంత దిగజారాలా జగన్..?



ఇదే.. ఆ వీడియో!

ఇదిగో ఈ వీడియోను కాస్త నిశితంగా పరిశీలించండి. ఫేక్ ఏది.. ఒరిజనల్ ఏదన్నది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అసలు చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ ఒరిజనల్ దాంట్లో క్లారిటీ ఉన్నాయి. ఇప్పుడు ఫేక్ వీడియోనూ ఒకసారి వినండి.. వైసీపీ ఎంతకు బరితెగించిందనేది తెలుస్తుంది. చూశారుగా.. అసలు కథేంటో మీకే అర్థమవుతోంది కదా. ఈ వీడియోపై స్పందించిన టీడీపీ.. వైసీపీకి దిమ్మదిరిగేలా కౌంటరిచ్చింది. ‘తాడేపల్లిగూడెం మీటింగ్ దెబ్బకు, తాడేపల్లి ప్యాలెస్ పిల్లికి భయం పట్టుకుంది. పిల్ల పాలేరు చేత, ఫేక్ వీడియోలు వదిలి, సంతోషపడుతున్నాడు’ అని ట్విట్టర్‌లో టీడీపీ రాసుకొచ్చింది. ఇక దీనిపై కామెంట్స్ అంటారా.. బాబోయ్.. లెక్కలేనన్ని వచ్చేస్తున్నాయ్. అతి తెలివి ప్రదర్శిస్తే.. అవతలి మనిషి ఎలా ఉంటాడనేది ఈ ట్వీట్ చూస్తే మీకే.. అర్థమవుతుంది.

YSRCP: టికెట్ ఇచ్చినా నియోజకవర్గం వైపు తొంగిచూడని వైసీపీ అభ్యర్థి.. వైఎస్ జగన్‌కు హ్యాండిచ్చేసినట్టేనా..?


Updated Date - Feb 29 , 2024 | 02:34 PM

Advertising
Advertising