ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRCP: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తెరపైకి కొత్తపేరు.. నీకో దండమన్న బాలినేని!

ABN, Publish Date - Jan 12 , 2024 | 03:45 PM

Balineni Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబిలతాను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబితాలను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్. ఈ మార్పులతో ఒకట్రెండు నియోజకవర్గాల్లో తప్ప దాదాపు అన్నిచోట్లా తీవ్ర వ్యతిరేకత, నేతల్లో.. సిట్టింగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న పరిస్థితి. ఈ దెబ్బతో ఎవరు ఎప్పుడు రాజీనామా చేసి.. టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకుంటారో తెలియట్లేదు. అయితే.. టికెట్ రాని నేతలంతా తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కడుతుంటే.. వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారిని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో వైసీపీ హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది.


మాగుంట ఉంటేనే ఉంటా!

సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం తేల్చి చెప్పేశారట. ఇందుకు కారణం టీడీపీ, జనసేనలపై నోరు చేసుకోకపోవడం.. జగన్ అడిగినన్ని కోట్ల రూపాయిలు ఇవ్వకపోవడమేనని గట్టిగానే టాక్ నడుస్తోంది. అయితే.. మాగుంటకు టికెట్ ఇస్తే సరే లేకుంటే తాను కూడా పార్టీలో ఉండే ప్రసక్తే లేదని.. అవసరమైతే పార్టీ మారడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే జగన్ రెడ్డికి క్లియర్ కట్‌గా బాలినేని సంకేతాలు కూడా పంపారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చేశారు. ఆయన్ను బుజ్జగించడానికి సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల ఇలా చాలా మందే ఇప్పటి వరకూ ప్రయత్నాలు చేశారు. తాజాగా.. వైసీపీ ముఖ్యనేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని.. బాలినేనితో రాయబారానికి పంపింది అధిష్టానం. సుమారు అరగంటకు పైగా బాలినేని-చెవిరెడ్డి నిశితంగా చర్చించారు.

నేనున్నా.. అన్నా..!

ఈ భేటీలో భాగంగా అన్నా.. ‘మీరు ఒప్పుకుంటే ఒంగోలు నుంచి నేను బరిలోకి దిగుతాను’ అని చెవిరెడ్డి ప్రతిపాదించారు. ఈ మాటకు ఒకింత ఆగ్రహానికి గురైన బాలినేని.. ‘నీకోదండం.. నీ సీఎంకో దండం’ అంటూ విసుక్కున్నారట. ఒంగోలు ఎంపీ అభ్యర్దిగా మాగుంటను తప్ప మరొకర్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని చెవిరెడ్డికి బాలినేని తేల్చిచెప్పేశారట. ఇదే విషయాన్ని సీఎంకు కూడా చెప్పాలని కుండ బద్ధలు కొట్టారట. ఇదంతా హైదరాబాద్‌లోని బాలినేని నివాసంలో శుక్రవారం నాడు జరిగిన కథ. దీంతో చేసేదేమీ లేక హైదరబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌గా చెవిరెడ్డి తిరుగుపయనం అయ్యారట. భేటీలో జరిగిన విషయాలన్నీ జగన్‌కు చెప్పాక సీఎం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.


నిజమైనట్టేగా..!

మరోవైపు.. సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బాలినేనికి ఎటువంటి సమస్య లేదని.. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడన్నారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని.. ఆయన స్థానం ఆయనకు ఉంటుందని స్పష్టం చేశారు. మూడు లిస్టులు ఇప్పటికే రిలీజ్ చేశామని త్వరలో మరో లిస్ట్ ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు అంటే పరస్పర ఆరోపణలు సహజమేనని.. ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. సీఎం జగన్‌ను టీడీపీ నేతలు విమర్శిస్తే తిప్పికొట్టడం వైసీపీ నేతల బాధ్యత అని.. ఆ బాధ్యతను ప్రతీ ఒక్కరూ నిర్వర్తించాలని ఎంపీ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అంటే.. ఇన్నిరోజులూ టీడీపీ, జనసేన అధినేతలను మాగుంట తిట్టకపోవడమే టికెట్ కట్ అయ్యిందన్న ప్రచారం.. సాయిరెడ్డి మాటలతో అక్షరాలా నిజమైందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Jan 12 , 2024 | 03:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising