AP Elections: వైసీపీపై ఈసీ చర్యలు తీసుకుంటుందా.. ఏం జరగబోతోంది..!?
ABN, Publish Date - Jan 11 , 2024 | 05:48 PM
AP Bogus Voters Issue: ఎన్నికల అధికారులు.. ఏదైనా ఒక పార్టీకో.. ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదు.. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలుంటాయి.. ఇవే ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ పదే పదే చెప్పే మాటలు. అయితే.. ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలకు ముందే బోగస్ ఓట్ల విషయంలో దారుణాతి దారుణాలు పాల్పడుతుంటే ఇంతవరకూ చలీచప్పుడు లేదు..
ఎన్నికల అధికారులు.. ఏదైనా ఒక పార్టీకో.. ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదు.. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలుంటాయి.. ఇవే ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ పదే పదే చెప్పే మాటలు. అయితే.. ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలకు ముందే బోగస్ ఓట్ల విషయంలో దారుణాతి దారుణాలు పాల్పడుతుంటే ఇంతవరకూ చలీచప్పుడు లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తిరుపతి ఉప ఎన్నికల్లో (Tirupati By Elections) జరిగిన భారీ మోసాలను ఎన్నికల కమిషనే బయటపెట్టింది. అంతేకాదు.. ఎన్నికల కమిషనర్ లాగిన్‌ను అధికార వైసీపీ నేతకు చేరింది. నాటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరిషా ఈ లాగిన్ ఇవ్వడంతో ఉప ఎన్నికల్లో భారీగానే డూప్లికేట్ ఓట్లు వచ్చిపడ్డాయి. వాస్తవానికి తిరుపతి సిట్టింగ్ ఎంపీ సీటును దక్కించుకోవడానికి నానా యాగీ చేసి చివరాకరికి ఈసీతో మొట్టికాయలు వేయించుకున్న పరిస్థితి. తెలిసినదే ఇంత అయితే.. ఇక ఇంతవరకూ జరిగిన ఎన్నికల్లో ఎన్నెన్ని అవకతవకలు వైసీపీ పాల్పడిందో ఒక్కసారి ఊహించుకోండి. వాస్తవానికి.. 2023 మొదటి నుంచీ ఓటరు జాబితాలను అధికార పార్టీ గల్లంతు చేస్తూనే ఉందన్నది జగమెరిగిన సత్యమే. ప్రతిసారీ ఈసీ దెబ్బలు పడినా.. ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమ చొరబాట్లను మాత్రం మానుకోలేదు.
చర్యలుంటాయా..?
కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం.. ఏపీలో మొత్తం ఓటర్లు : 4.07 కోట్ల మంది ఉండగా ఇందులో పురుషులు : 1.99 కోట్లు, మహిళలు : 2.07 కోట్లు, ట్రాన్స్‌జెండర్లు : 3,486 వేలు, దివ్యాంగ ఓటర్లు : 4.76 లక్షలు, వయో వృద్ధులు 80 ఏళ్లు పైబడిన వారు : 5.8 లక్షల మంది, యుక్త వయసు వచ్చిన వారు : 7.88 లక్షల మంది ఉన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 నుంచి 1500 మంది ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఓట్లు యాడింగ్ కోసం 17,76,850 మంది ఓటర్లు అప్లయ్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. తిరుపతి ఎన్నికలతో బయటపడిన అక్రమాలపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా..? అనేది చూడాల్సి ఉంది. అయితే.. ఇలాంటివి కావలి, పర్చూరు ఇలా ఒకటా రెండా 175 నియోజకవర్గాల్లో ఎన్ని మండలాల్లో.. ఇంకెన్ని గ్రామాల్లో జరిగి ఉంటాయో ఒక్కసారి చూడండి. అందుకే.. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప కొలిక్కి అవకాశం లేదని టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. అయితే.. త్వరలోనే ఎన్నికల కమిషన్ నుంచి వైసీపీకి గట్టిగానే దెబ్బ పడనుందనే టాక్ నడుస్తోంది. కాగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల కమిషన్ ఎంతవరకూ ఇలాంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
Updated Date - Jan 11 , 2024 | 05:54 PM