TDP Ra Kadali Ra Live Updates: ఉరవకొండ వేదికగా సీఎం జగన్‌ను ఆటాడుకున్న చంద్రబాబు!
ABN, Publish Date - Jan 27 , 2024 | 05:48 PM
TDP Ra Kadali Ra Sabha: ‘రా.. కదలిరా!’ అన్న పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులై.. టీడీపీని అక్కున చేర్చుకున్నారు..
06:25 PM : వైసీపీ సినిమా అయిపోయింది..
రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందంటూ చంద్రబాబు సెటైర్లు
సీట్లు ఇచ్చినా నేతలు వెళ్లిపోతున్నారు
ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పారిపోతున్నారు
తనకు టీవీ, పేపర్ లేదంటూ జగన్‌రెడ్డి అబద్దాలు చెబుతున్నారు
జగన్, ఆయన చెల్లి కొట్టుకుంటే నేను కారణమా?
రాష్ట్రంలో అందరూ నాకు స్టార్ క్యాంపెనర్లే: చంద్రబాబు
06:15 PM : ఎవర్నీ వదిలిపెట్టం.. బాబు మాస్ వార్నింగ్
మా కార్యకర్తలను బాధపెట్టిన వారిని వదిలిపెట్టం
ఎప్పుడూ పోలీసులకు అండగా ఉంటే పార్టీ మాదే
వైసీపీ గూండాలు జాగ్రత్తగా ఉండాలి.. ఖబర్దార్
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా.. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా
ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు
దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం
మీ భూముల పాస్‌బుక్‌లపై జగన్ ఫొటో ఎందుకు?
వైపీసీ ప్రభుత్వం తెచ్చింది భూ భక్షణ చట్టం
మేం వచ్చిన వెంటనే భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తాం: చంద్రబాబు
06:05 PM : జాకీ సంగతేంటి జగన్..?
అనంతపురం జిల్లాకు రావాల్సిన జాకీ పరిశ్రమ ఏమైంది?
కమిషన్లు ఇవ్వలేక అనేక పరిశ్రమలు తరలిపోయాయి
యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం
ఉద్యోగం వచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం
టీడీపీ హయాంలో విండ్, సోలార్ పవర్‌కు ప్రాధాన్యత ఇచ్చాం
వైసీపీ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి పేదల పొట్ట కొట్టారు: చంద్రబాబు
06:00 PM : వైసీపీని భూస్థాపితం చేసేద్దాం!
ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు యువత సిద్ధమయ్యారు
పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎవరిని మోసం చేస్తారు?
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా మేం చూశాం
వైసీపీ ప్రభుత్వం మాత్రం ఫిష్ మార్ట్, వైన్ షాప్‌ల్లో ఉద్యోగాలు ఇచ్చింది
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమలను తరిమేశారు
పరిశ్రమలు ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి
మీరు 10 అడుగులు వేయండి.. నేను వంద అడుగులు వేస్తా: చంద్రబాబు
05:55 PM : వైసీపీతో అంతా నష్టమే..!
వైసీపీ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదు
వైసీపీ పాలనలో తెలుగుజాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది
జిల్లాకు నీరు ఇస్తే ఇక్కడ బంగారం పండిస్తారు
జిల్లాలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనేది నా లక్ష్యం
నీళ్లు ఉంటే అనంత జిల్లాతో గోదావరి జిల్లాలు పోటీపడలేవు
రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా పనులు చేశాం
గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలని అనుకున్నా
గతం 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించా
ప్రపంచానికి ఉద్యాన వంటలు అందించే అవకాశం అనంతపురం జిల్లాకే ఉంది
ఈ సీఎంకు ఉల్లిగడ్డకు.. ఆలుగడ్డకు కూడా తేడా తెలియదు: చంద్రబాబు
05:53 PM : టీడీపీ-జనసేన గాలి..!
ఉరవకొండలో టీడీపీ-జనసేన గాలి వీస్తోందన్న చంద్రబాబు
ఉరవకొండ సభను చూస్తే జగన్‌రెడ్డికి నిద్ర పట్టదు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లలో గెలుపు మనదే
ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చింది
హ్యాపీగా దిగిపోతా అని ఇప్పుడే జగన్ అంటున్నారు
రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉంది
05:50 PM : ఎగిరేది మన జెండాలే..!
ప్రజా వెల్లువ చేస్తేనే తెలుస్తోంది ఎన్నికల్లో ఏం జరుగుతోందో?
అనతంపురం జిల్లాలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే: పయ్యావుల
ఉరవకొండలో అందించిన సేవలకు సంతృప్తిగా ఉంది
వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టింది
నీళ్లు ఇస్తే రతనాలు పండించగలమని గతంలో రుజువు చేశాం
రాయలసీమకు నీళ్లు ఇస్తే మా తలరాతలు మారతాయి
కరువుతో పోరాడిన ధైర్యం సీమ రైతులకు ఉంది
వైసీపీ పాలనలో ఉరవకొండలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు
టీడీపీ హయాంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం
‘రా.. కదలిరా!’ అన్న పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులై.. టీడీపీని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చు కుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ‘రా.. కదలిరా’.. అంటూ టీడీపీ గెలుపు కోసం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో సభ జరుగుతోంది. లైవ్‌లో చూసేద్దాం రండి..
Updated Date - Jan 27 , 2024 | 06:29 PM