ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politcs: జాతీయ రాజకీయాలకు బీఆర్ఎస్ దూరమేనా.. కేసీఆర్ లెక్కలివిగో..!

ABN, Publish Date - Feb 03 , 2024 | 09:18 PM

BRS Chief KCR National Politics: జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ (KCR) భావిస్తున్నారా..? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సారుకు తెలిసొచ్చింది ఇదేనా..? ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని బీఆర్ఎస్ చీఫ్ ఫిక్స్ అయ్యారా..? పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమా..? అంటే తాజా పరిణామాలు చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది..

జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ (KCR) భావిస్తున్నారా..? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సారుకు తెలిసొచ్చింది ఇదేనా..? ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని బీఆర్ఎస్ చీఫ్ ఫిక్స్ అయ్యారా..? పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమా..? అంటే తాజా పరిణామాలు చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ కేసీఆర్ నిజంగానే జాతీయ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారా..? జస్ట్ ఇదంతా బ్రేక్ మాత్రమేనా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రాజకీయ కథనంలో తెలుసుకుందాం..


ఇదీ అసలు కథ..

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలె.. అవసరం అయితే ఉప ప్రధాని పదవిని సృష్టించాలే.. ఢిల్లీ వేదికగా బరాబర్ రాజకీయాలు చేస్తాం.. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడిస్తాం.. ! ఇవీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ నోట పదే పదే వచ్చిన మాటలు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని కాస్త భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) గా మార్చిన సంగతి తెలిసిందే. ఏ క్షణాన కేసీఆర్ ఈ పనిచేశారో.. నాటి నుంచే బీఆర్ఎస్‌కు పరిస్థితులు అనుకూలించలేదన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఎందుకంటే.. టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల సెంటిమెంట్.. ఎప్పుడైతే పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారో నాటి నుంచే పతనం మొదలైందన్నది సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న భావన. ఇదే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడింది.. ఇందుకే ఇప్పట్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న పార్లమెంట్.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని.. ఆ తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తన అత్యంత ఆప్తులతో కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫోకస్ మొత్తం తెలంగాణ మీదే పెట్టి ఇక్కడ గెలిచిన తర్వాతే మిగిలిన రాష్ట్రాల్లోకి వెళ్లాలని ఫైనల్‌గా బాస్ నిర్ణయించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.


లెక్కలివేనా..?

వాస్తవానికి తెలంగాణ తర్వాత కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రంలోనే. ఏపీకి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను ప్రకటించడం.. మహారాష్ట్ర సమన్వయకర్తగా వంశీధర్‌ను నియమించడం జరిగింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఏపీ బీఆర్ఎస్‌లో ఉన్న కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో ఇప్పుడు దాదాపు పార్టీ ఖాళీ అయిపోయింది. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే.. ఎన్నికల తర్వాత కనీసం కేసీఆర్‌ను కలుద్దామన్నా అపాయిట్మెంట్ ఇవ్వట్లేదట. వంశీధర్‌కు పదే పదే స్థానిక నేతలు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదట. పైగా.. త్వరలో ఏపీ, మహారాష్ట్రలో జరుగుతన్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఏపీ, మహారాష్ట్రలో కనీసం ఎన్నికల చప్పుడు కూడా బీఆర్ఎస్ చేయట్లేదు.. అటువైపు కూడా తొంగి చూడట్లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఎన్నికలకు దూరంగా ఉండాలనే బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించారట. బలం లేని.. ఎలాంటి క్యాడర్‌లేని రాష్ట్రాల్లో అనవసరం వేలు పెట్టడం కంటే మిన్నకుండిపోవడమే బెస్ట్ అని గులాబీ నేతలు అనుకుంటున్నట్లు సమాచారం.

ఏం జరుగుతుందో..?

అయితే.. అబ్బే అదేం లేదని సింహం త్వరలోనే బయటికి వస్తుందని ఇది జస్ట్ బ్రేక్ మాత్రమేనని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కేసీఆర్.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తూ మొదలుపెట్టారని.. మున్ముందు సినిమా వేరేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. రాష్ట్రమా..? దేశమా..? ఈ రెండింటిలో కేసీఆర్ మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2024 | 09:22 PM

Advertising
Advertising