ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: సీఎం జగన్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 09 , 2024 | 03:29 PM

KA Paul: ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్‌కు తెలిపారు. అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అనంతరం జగన్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్‌కు తెలిపారు. అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అంతకుముందు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం క్యాంప్ ఆఫీస్ వద్ద కేఏ పాల్ గంటకు పైగా వేచి చూశారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో క్యాంప్ కార్యాలయం నుంచి నిరాశగా తిరిగి వెళ్లిపోయారు.

కాగా ఎంతో మంది దేశాధినేతలు తాను అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారని కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం తనకు అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. కానీ కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ చివరకు మాజీ సీఎం అయ్యారని గుర్తుచేశారు. ఆయన మాజీ సీఎం అయ్యాకే తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. ఒకవేళ జగన్ కూడా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ తరహాలోనే జగన్ మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ జోస్యం చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని కొనియాడారు. అయితే జగన్ అపాయింట్ మెంట్ కోసం రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ ఇస్తే సీఎంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తానని.. రహస్యాలు చెబుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో లేదా 75 సీట్లు గెలుస్తారో.. లేదా 25 సీట్లు మాత్రమే గెలుస్తారో తనకు తెలియదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 03:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising