ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పచ్చదనం పరిఢవిల్లేలా..

ABN, Publish Date - Jun 19 , 2024 | 04:04 PM

పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

  • వజ్రోత్సవ వనమహోత్సవం

  • కొత్త పేరుతో జూలై 1నుంచి వనమహోత్సవం ప్రారంభం

  • 4 కోట్ల మొక్కలను సిద్ధం చేసిన హెచ్‌ఎండీఏ

  • గ్రేటర్‌ పరిధిలో 33శాతం గ్రీనరీ పెంచే లక్ష్యం

  • రూ.380 కోట్లతో పనులు చేపట్టేందుకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు గడిచిన నేపథ్యంలో ‘వజ్రోత్సవ వనమహోత్సవం’ పేరిట మొక్కలు నాటేందుకు కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కొత్త పేరుతో మొక్కలు నాటడంతో పాటు ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలిచేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని జూలై మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది నాటేందుకు 4 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు నగరాలు, పట్టణాల్లో 33 శాతం గ్రీనరీ ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

ఈ ఏడాది 20శాతానికి పెంచేలా..

ప్రపంచంలోని పలు పేరొందిన నగరాలు 33 శాతానికి పైగా పచ్చదనంతో మెరుగ్గా ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు పచ్చదనానికి ప్రత్యేక ప్రాధాన్యతిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో చెట్లు కనుమరుగువుతున్నాయి. చెరువులు, కుంటలు మాయమవుతున్నాయి. అయితే మొక్కలు నాటడమే గాకుండా బాధ్యతగా పెంచడం, చెరువులు, కుంటలను కాపాడేందుకు వాటిని పూర్తిగా సుందరీకరణ చేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. ఈ ఏడాది దాదాపు రూ.380 కోట్లతో మొక్కలు నాటడం, పార్కులను అభివృద్ధి చేయడం, చెరువులను సుందరీకరించడం, ఔటర్‌తో పాటు జాతీయ రాష్ట్రీయ రహదారుల వెంట పచ్చదానాన్ని మెరుగుపరిచేందుకు పలు లక్ష్యాలను నిర్దేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న 12.9 శాతం గ్రీనరీని 33 శాతానికి పెంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఈ ఏడాది కనీసం 20శాతం పచ్చదనాన్ని గ్రేటర్‌ పరిధిలో పెంచేందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు కసరత్తును ప్రారంభించాయి.

పండ్ల మొక్కలే అధికం

హెచ్‌ఎండీఏతో పాటు ప్రభుత్వంలోని పలు శాఖలు ప్రతీ ఏడాది వర్షాకాలం ప్రారంభం సమయంలో మొక్కలు నాటడంతో పాటు పచ్చదనం అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతాయి. గత ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించగా, కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వాతంత్య్ర స్ఫూర్తితో ‘వజ్రోత్సవ వనమహోత్సవం’ పేరుతో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని దాదాపు 40 నర్సరీల్లో సుమారు రూ.75కోట్ల వ్యయంతో 4 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. మొత్తం 165 రకాల మొక్కలు కాగా, అందులో 45 పండ్ల రకాల మొక్కలే ఉండడం విశేషం. ఇళ్లలో పెంచుకునేందుకు అధికంగా పండ్ల రకాల మొక్కలకు అధిక ప్రాధాన్యతిస్తుండడంతో వాటిని పెద్ద సంఖ్యలో పెంచారు. పూల మొక్కలతో పాటు పచ్చదనంతో పాటు పర్యావరణానికి అనువైన మొక్కలను పెంచుతున్నారు. ఇందులో ఎత్తైన మొక్కలను ఖాళీ స్థలాలు, పార్కులు తదితర ప్రాంతాలో నాటేందుకు కసరత్తు చేస్తున్నారు. పండ్లు, పూల మొక్కలను అవసరమైన వారికి నర్సరీలల వద్దే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.

రూ.35కోట్లతో ఔటర్‌ గ్రీనరీ నిర్వహణ

ఔటర్‌ రింగ్‌ రోడ్డును ప్రైవేటు సంస్థకు అప్పగించినప్పటికీ 158 కిలోమీటర్ల మేర సెంట్రల్‌ మీడియన్‌తో పాటు ఇరువైపుల పచ్చదనం పెంపొందించే బాధ్యతలు హెచ్‌ఎండీఏకే ఉన్నాయి. దాంతో పచ్చదనం నిర్వహణ కోసం రూ.35 కోట్లతో చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు విభాగం ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. ఔటర్‌పై ప్రయాణించే వాహనదారులకు ఆహ్లాదన్నిచ్చే విధంగా ప్రస్తుతమున్న 11రకాల మొక్కలను ‘వజ్రోత్సవ వనమహోత్సవం’ పూర్తిస్థాయిలో మెరుగుపర్చాలని నిర్ణయించారు.

Updated Date - Jun 19 , 2024 | 04:04 PM

Advertising
Advertising