AP Politics: ఫిబ్రవరి 4న జనసేనలోకి వైసీపీ ఎంపీ.. పవన్ సమక్షంలో చేరిక
ABN, Publish Date - Jan 29 , 2024 | 09:01 PM
MP Balashowry: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) పరిస్థితులు అల్లకల్లోల్లంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పుతో వైసీపీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) పరిస్థితులు అల్లకల్లోల్లంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పుతో వైసీపీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashowry) పార్టీకి రాజీనామా చేసి.. జనసేన (Janasena) కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరి-04న ఎంపీ బాలశౌరి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. జనవరి-13న వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి.. రోజుల వ్యవధిలోనే పవన్‌తో భేటీ అయ్యి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే.. జనసేనలో చేరిన తర్వాత బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీచేస్తారా లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీచేయడానికే ఆయన ఇంట్రెస్టుగా ఉన్నారని అనుచరులు చెబుతున్న మాట.
రాజీనామా వెనుక..?
బాలశౌరి.. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఈయన అత్యంత ఆప్తుడు అనే విషయం తెలిసిందే. మచిలీపట్నం నుంచి ఎంపీగా ఓ మాజీ మంత్రిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. వైసీపీకి రాజీనామా చేసేశారు. మరోవైపు.. బాలశౌరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని అందుకే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే.. మచిలీపట్నం నుంచి ఎంపీగా పేర్ని నానిని బరిలోకి దింపాలని.. బాలశౌరికి పొమ్మనలేక హైకమాండ్ పొగబెట్టిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కాగా.. పేర్ని నానికి-బాలశౌరికి గత కొన్నిరోజులుగా అస్సలు పడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టును మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు. ఇందుకే నానిని ఎంపీగా పోటీచేయించాలన్నది వైసీపీ ప్లానట. ఫైనల్‌గా వైసీపీ తరఫున ఎంపీగా ఎవరు పోటీ చేస్తారో..? జనసేన లేదా టీడీపీ తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారో వేచి చూడాల్సిందే మరి.
AP Politics: వైసీపీకి ఊహించని షాక్.. ఎంపీ బాలశౌరి రాజీనామా
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 29 , 2024 | 09:04 PM