YS Jagan: పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్‌కు ఊహించని పరిణామం
ABN, Publish Date - Jun 22 , 2024 | 07:10 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం.. ఆపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం.. ఆపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం.. ఈ మధ్యలో రుషికొండ రాజ్‌మహల్ రహస్యం వెలుగుచూడటం ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని షాకులు తగులుతున్న పరిస్థితి. దీనికి తోడు శనివారం తెల్లవారుజామున నిర్మాణంలో వైసీపీ కేంద్ర కార్యాలయ్యాన్ని కూల్చివేయడం.. ఆ తర్వాత పులివెందుల పర్యటనకు వెళ్లగా రాయలసీమ నేతలు ఇద్దరు ముగ్గురు తప్ప పెద్దగా ఎవరూ రాకపోవడంతో హైకమాండ్ కంగుతిన్నది. ఈ విషయాలన్నీ జరిగిన కొన్ని గంటల్లోనే వైఎస్ జగన్‌కు సొంత పార్టీ కార్యకర్తలే ఝలక్ ఇచ్చారు. అది కూడా ఊహించని రీతిలో కావడంతో ఈ ఘటన చూసిన జనాలు, నేతలు నివ్వెరపోతున్నారు.
వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే
తీవ్ర ఉద్రిక్తత!
పులివెందుల పర్యటన నిమిత్తం సొంత నియోజకవర్గానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు కార్యకర్తలు ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన పులివెందులకు వెళ్లారు. అయితే.. వైఎస్ జగన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎంను చూసేందుకు పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు విచ్చేశారు. అయితే.. జగన్‌ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో ఓటేసి గెలిపించిన మమ్మల్నే జగన్ కలవకపోవడం ఏంటి..? సెక్యూరిటీ ఎందుకిలా తోసేస్తోంది..? అంటూ ఆగ్రహంతో కార్యకర్తలు రగిలిపోయారు. ఇంకొందరు కార్యకర్తలు అయితే సహనం కోల్పోయి మాజీ సీఎం ఇంటి అద్దాలు పగులకొట్టారు. వైఎస్ జగన్ డౌన్.. డౌన్ అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు సైతం చేయడం గమనార్హం. ఎక్కడ్నుంచో వచ్చిన తమను జగన్‌ను చూడటానికి, కనీసం ఇంట్లోకి పంపకుండా సిబ్బంది అడ్డుకున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఈ ఘటనతో జగన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు, జగన్ సిబ్బంది కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఊహించని పరిణామంతో వైఎస్ జగన్ సైతం షాకయ్యారట. సొంత నియోజకవర్గంలోనే ఇలా జరగడంతో వైసీపీ పెద్దలు కంగుతిన్నారు.
త్వరలో కడప పార్లమెంట్ ఉప ఎన్నిక..?
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 22 , 2024 | 07:52 PM