ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మేం భరించలేం..

ABN, Publish Date - Apr 28 , 2024 | 03:41 PM

అధికారం కోల్పోయి నారాజ్‌గా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు, నేతలకు లోక్‌సభ ఎన్నికలు భారంగా మారాయి.

  • ఎంపీ ఎన్నికలకు వెచ్చించలేం

  • వ్యయం తడిసిమోపెడవుతోంది..

  • గులాబీ మాజీ ఎమ్మెల్యేలు, నేతల ఆందోళన

  • మొక్కుబడిగా సాగుతున్న ప్రచారం

  • జోరు మీదున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు

  • రెండు పార్టీల ప్రతికూలతలపై బీజేపీ ఫోకస్‌

యాదాద్రి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయి నారాజ్‌గా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు, నేతలకు లోక్‌సభ ఎన్నికలు భారంగా మారాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసిన నేతలు ఎంపీ ఎన్నికల్లో వెచ్చించేందుకు ముందుకురావడం లేదు. నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు గులాబీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓడిపోయిన ఎమ్మెల్యేలతోపాటు స్థానిక నేతలంతా తమపైన పూర్తిభారాన్ని వేసుకొని ప్రచారం చేసేందుకు కలిసిరావడం లేదు. అధిష్ఠానం పెద్దలు సభలు నిర్వహించినపుడు సమావేశాలకు హాజరవుతున్నారు. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదు. మొన్నటి ఎన్నికల్లోనే తమకు శక్తికి మించి ఖర్చు పెట్టామని, ఎంపీ ఎన్నికలకు ఎలా భరించగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఓడిన చోటే గెలవాలని అధిష్ఠాన పెద్దలు స్పష్టంగా చెప్పడంతో కొందరు నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.

అఽధికార పార్టీ నేతల హవా

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను స్థానిక మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలకు అధిష్టానం అప్పగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆదేశించింది. అభ్యర్థులను కలుపుకొని స్థానిక ఎమ్మెల్యేలు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు సమన్వయంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులు గ్రామాల్లో ఉత్సాహంగా తిరుగుతున్నారు. రేపటి ‘భవిష్యత్తు’కు ఇప్పట్నుంచే ‘బాటలు’ వేసుకుంటున్నారు.

పాగా కోసం కమలం యత్నం

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్‌ ఎన్నికలను వేదికగా చేసుకొని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రెండు నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ అభ్యర్థులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల్లోని ప్రతికూలతలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అవసరమైతే ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున చేర్చుకుంటున్నారు.

ఖర్చుల భారం

ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. అసలే ఎండాకాలం, మండుతున్న ఎండలకు జనం రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. ఒక్కో కార్యకర్తకు కనీసం రూ.500 ఇస్తే గానీ సభలు, ర్యాలీలకు రావడం లేదు. ఒక భారీ బహిరంగ సభ పెట్టాలంటే జనాల తరలింపు, వాహనాలకు బ్యానర్లు, ఇతర ఖర్చులు రూ.లక్షల్లో అవుతోంది. ఇక నిత్యం ప్రచారంలో పాల్గొనేందుకు సైతం కార్యకర్తలకు ఎంతోకొంత ముట్టజెప్పడంతోపాటు మందు, హోటల్‌ ఖర్చులు అదనపు భారమవుతున్నాయని వాపోతున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 03:43 PM

Advertising
Advertising