ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పట్టభద్రుడెవరో?

ABN, Publish Date - May 24 , 2024 | 03:48 PM

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది.

  • మూడు పార్టీలకూ సవాలే!

  • పతాకస్థాయికి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం

  • కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎ్‌సల హోరాహోరీ పోరు

  • విజయం కోసం చెమటోడుస్తున్న అభ్యర్థులు

  • మూడు జిల్లాల్లో 4.64 లక్షల ఓట్లు

  • బరిలో 52మంది అభ్యర్థులు.. 27న పోలింగ్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌): వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. మొత్తం 4.64 లక్షల మంది గ్రాడ్యుయేట్స్‌ ఓటర్లు ఉండగా, 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అత్మీయ సమ్మేళనాలు, వాకర్స్‌తో వాకింగ్‌ చేస్తూ, ఫోన్లు చేస్తూ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ కీలక నేతలు ప్రచారంలోకి దిగారు. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికను చాలెంజ్‌గా తీసుకుని పోరాడాలని కమలం పార్టీ నిర్ణయించినట్లుగా సమాచారం. అలాగే గత నాలుగు పర్యాయాలు వరుసగా గెలుస్తున్న బీఆర్‌ఎస్‌ ఐదోసారి కూడా పాగా వేయాలని ఎత్తులు వేస్తోంది. బీజేపీ నేపథ్యం ఉన్న ఎనుగల రాకే్‌షరెడ్డిని బరిలో దించింది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికను సవాల్‌గా తీసుకుంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్‌ మల్లన్నను బరిలో దించి విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. దీంతో పట్టభద్రులు ఎవరికి పట్టం కడుతారో అనే ఉత్కంఠ నెలకొంది.

పురుష ఓటర్లే అధికం

ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,88,189 మంది ఉండగా, 1,75,645 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1,73,413 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,08,349 మంది, మహిళలు 65,063 మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మొత్తం 1,66,448 మంది ఓట్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,06,574 మంది, మహిళ ఓటర్లు 59,874 మంది ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1,23,985 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 73,266 మంది, మహిళలు 50,715 మంది ఉన్నారు. మహిళ ఓటర్ల కంటే పురుష ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాగా, శనివారంతో ప్రచారం సమాప్తం కానుంది. 27న(సోమవారం) ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.

కాంగ్రె్‌సకు సవాల్‌గా ఎమ్మెల్సీ ఎన్నిక

ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలువాలని కాంగ్రెస్‌ టార్గెట్‌ పెట్టుకుంది. శాసనమండలిలో కాంగ్రె్‌సకు మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నిక సవాల్‌గా మారింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ నామమాత్రపు పోటీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన తీన్మార్‌ మల్లన్నను ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే తృతీయ స్థానంలో నిలిచిన ప్రొఫెసర్‌ కోదండరాం ప్రస్తుతం కాంగ్రె్‌సకు మద్దతుగా ఉండటంతో ఈసారి విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. దీనికితోడు కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం తమకు కలిసి వస్తుందనే లెక్కల్లో ఆ పార్టీ ఉంది. అలాగే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో టీజేఎ్‌సతో పాటు సీపీఐ, సీపీఎంలు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. వీటికి తోడు నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో దాదాపు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సకు చెందినవారే అధికంగా ఉండటంతో గెలుపు ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇక చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సొంతంగా తీన్మార్‌ మల్లన్న టీమ్‌ ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో తన సొంత ఓటు బ్యాంకును పెంచుకుంటూ వచ్చారు. దీంతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీన్మార్‌ మల్లన్నను గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈసారి పక్కగా కాంగ్రెస్‌ గెలుస్తుందనే ధీమా ఆ పార్టీ కేడర్‌లో ఉంది.

గెలుపుపై బీజేపీ ధీమా

ఈ ఎన్నికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. విజయమే లక్ష్యంగా కమలనాధులు ప్రచారంలో అగ్రనేతలను దింపుతున్నారు. రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పని చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక అయినప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అగ్రనేతలు ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌, డీకే అరుణ తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.9 శాతం ఓట్లను పొందిన బీజేపీ ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో పాటు డబుల్‌ డిజిట్‌ ఎంపీ స్థానాలను గెలుస్తామనే ధీమాతో ఉంది. ముఖ్యంగా యువత బీజేపీకి సపోర్టుగా నిలిచినట్లుగా ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో యువతే కీలకంగా ఉండటంతో తమకు కలిసి వస్తుందనే అంచనాల్లో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో కచ్చింతగా గెలువాలని, తక్కువ ఓట్లు వస్తే ఆ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడి పార్టీ బలహీన పడే అవకాశం ఉందనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతుంది. దీంతో కచ్చితంగా ఈ ఎన్నికలో గెలిచి తీరాలనే లక్ష్యంతో కమలనాధులు వ్యూహత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఐదోసారి పాగాకు గు’లాబీయింగ్‌’

ఈ ఎన్నిక గులాబీ పార్టీకి సవాల్‌గా మారింది. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత 2007లో తొలిసారిగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కపిలవాయి దిలీ్‌పకుమార్‌ విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి దిలీ్‌పకుమార్‌ విజయం సాధించారు. 2015, 2021లో వరుసగా రెండు పర్యాయాలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2007 నుంచి 2021 వరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. ఉద్యమ సమయంతో పాటు అధికారంలో ఉన్న సమయంలోనూ గ్రాడ్యుయేట్‌ ఓటర్లు గులాబీ పార్టీకి జై కొట్టారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు కీలక నేతలు పార్టీని వీడుతున్న సమయంలో ఈ ఎన్నికల్లో గెలుపు బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అభ్యర్థిగా ఎనుగుల రాకే్‌షరెడ్డిని బరిలోకి దించింది. గత నవంబరులో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి రాకే్‌షరెడ్డి బీఆర్‌ఎ్‌సలో చేరారు. బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుతో పాటు పూర్వ పరిచయాలతో బీజేపీ ఓటు కూడా రాకే్‌షరెడ్డి వైపు మొగ్గు చూపుతుందనే అంచనాలతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఆశించిన స్థాయిలో సీట్లు రావనే ప్రచారం ఉండటంతో ఎమ్మెల్సీ సీటునైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు పని చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు ఐదారు రోజులుగా రాకే్‌షరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.

జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు

జిల్లా - పురుషులు - మహిళలు - ఇతరులు - మొత్తం

వరంగల్‌ - 27,038 - 16,774 - 00 - 43,812

హనుమకొండ - 25,739 - 17,990 - 00 - 43,729

జనగామ - 14,915 - 8,503 - 01 - 23,419

సిద్దిపేట - 3,122 - 1,557 - 00 - 4,679

మహబూబాబాద్‌ - 22,948 - 11,985 - 00 - 34,933

భూపాలపల్లి - 8,000 - 4,535 - 00 - 12,535

ములుగు - 6,587 - 3,719 - 00 - 10,306

నల్గొండ - 51,560 - 29,311 - 00 - 80,871

సూర్యాపేట - 34,176 - 17,321 - 00 - 51,497

యాదాద్రి - 20,838 - 13,242 - 00 - 34,080

ఖమ్మం - 50,676 - 33,199 - 04 - 83,879

భద్రాద్రి - 22,590 - 17,516 - 00 - 40,106

మొత్తం - 2,88,189 - 1,75,645 - 05 - 4,63,839

Updated Date - May 24 , 2024 | 04:25 PM

Advertising
Advertising