ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Results: వైఎస్ జగన్ చెప్పినట్లే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసిందిగా!

ABN, Publish Date - Jun 04 , 2024 | 02:25 PM

అవును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చెప్పినట్లుగా యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది..! అదేంటి ఘోరాతి ఘోరంగా వైసీపీ (YSRCP) ఓడిపోయింది కదా.. ఇక చూడటమేంటి..? ఇదేం విడ్డూరమనే సందేహాలు వచ్చాయ్ కదా..! అక్కడికే వస్తున్నా ఆగండి..! ఇంకెందుకు ఆలస్యం.. మీ సందేహాలన్నింటికి క్లియర్ కట్‌గా సమాధానాలు దొరకాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదివేయాల్సిందే మరి.

అవును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చెప్పినట్లుగా యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది..! అదేంటి ఘోరాతి ఘోరంగా వైసీపీ (YSRCP) ఓడిపోయింది కదా.. ఇక చూడటమేంటి..? ఇదేం విడ్డూరమనే సందేహాలు వచ్చాయ్ కదా..! అక్కడికే వస్తున్నా ఆగండి..! ఇంకెందుకు ఆలస్యం.. మీ సందేహాలన్నింటికి క్లియర్ కట్‌గా సమాధానాలు దొరకాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదివేయాల్సిందే మరి.


అంతా దేవుడి స్క్రిప్ట్.. అవును అక్షరాలా నిజమే జగన్!

ఇదీ అసలు సంగతి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఐప్యాక్ టీమ్‌ను (I-PAC Team) అభినందించడానికి వైఎస్ జగన్ ఆఫీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన జగన్.. ‘మనం గెలుస్తున్నాం.. ఎంతలా అంటే దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఇక పీకే (ప్రశాంత్ కిషోర్) మాటలు మనం పట్టించుకోనక్కర్లేదు’ అని చెప్పుకొచ్చారు. అది కూడా బల్లగుద్ధి మరీ జగన్ పదే పదే చెప్పారు. ఇక అధినేతే చెప్పాక మనదేముంది అని మంత్రులు, అభ్యర్థులు ఎంత హడావుడి చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదికగా జగన్ మాటలను పట్టుకుని సినిమా రేంజిలో గ్రాఫిక్స్, డైలాగ్స్ జోడించి నానా రచ్చ రచ్చే చేశారు. సీన్ కట్ చేస్తే అట్టర్ ప్లాప్!


అవును దేశం చూసిందిగా!

వైఎస్ జగన్ అన్నట్లుగానే దేశం మొత్తం ఏపీ వైపే చూసింది.. ఎలాగంటే ఇంత ఘోరాతి ఘోరంగా పార్టీ ఓడిపోయిందేంటి..? అని దేశమంతా చూసింది. జగన్ అనుకోవడం.. ఇలా జరిగిపోవడం ఇది కూడా దేవుడి స్క్రిప్టేనేమో సుమీ!. వాస్తవానికి జగన్ ఈ మాట అన్నప్పుడే భారతదేశం సంగతి అటుంచి.. తెలుగుదేశం సంగతి చూడండి అని పెద్ద ఎత్తునే కౌంటర్లు వచ్చాయి. ఇప్పుడు అటు దేశం.. ఇటు తెలుగు దేశం రెండూ ఏపీవైపు గట్టిగానే చూశాయ్. చూశారుగా.. ఇదీ దేశం మొత్తం ఏపీ వైపు చూడటమంటే.. అర్థమైందా రాజా!

Updated Date - Jun 04 , 2024 | 02:26 PM

Advertising
Advertising