ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila : తాడేపల్లి ప్యాలెస్‌లో వైఎస్ జగన్‌తో భేటీ కానున్న వైఎస్ షర్మిల

ABN, Publish Date - Jan 02 , 2024 | 09:59 PM

YS Sharmila To Meet AP CM YS Jagan : అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇన్నిరోజులూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్నారు.. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణమే రివర్స్ కాబోతోందన్నారు..! సడన్‌గా ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా..? సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ మాత్రమే కాబోతున్నారు...

అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇన్నిరోజులూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్నారు.. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణమే రివర్స్ కాబోతోందన్నారు..! సడన్‌గా ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా..? సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ మాత్రమే కాబోతున్నారు. రాజకీయంగా అయితే అస్సలు కాదు. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం వాస్తవమే.. అధిష్టానం నుంచి ఆహ్వానం వచ్చిందని కూడా స్వయంగా మంగళవారం నాడు ఇడుపులపాయ వేదికగా షర్మిలనే చెప్పేశారు. అయితే.. ఇప్పుడు జగన్‌తో ఆయన సోదరి షర్మిల భేటీ మాత్రం వేరు. భేటీ ఎందుకు..? సరిగ్గా ఏపీ రాజకీయాలు హీటెక్కిన ఈ సమయంలోనే ఎందుకు..? భేటీలో ఏం జరగబోతోందనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


ఇందుకే భేటీ..!

ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియాను.. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించి.. పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ రోజున ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షర్మిల ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర శుభలేఖను ఉంచి, ప్రార్థనలు చేసి.. తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడే ఉన్న షర్మిల బుధవారం మధ్యాహ్నం నేరుగా ఇడుపులపాయ నుంచి నేరుగా తాడేపల్లికి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సోదరుడు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లి భేటీ కాబోతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు సోదరుడితో షర్మిల భేటీ కానున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉంటారని తెలుస్తోంది. అన్నకు శుభలేఖ ఇచ్చి.. కుమారుడి వివాహానికి ఆహ్వానించబోతున్నారు. ఈ భేటీ అనంతరం విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని షర్మిల మీడియాకు వెల్లడించారు.

ఏం జరగబోతోంది..?

కాగా.. రాజారెడ్డి-ప్రియాల నిశ్చితార్థ వేడుక జనవరి-18న, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్నట్లు షర్మిల అధికారికంగా న్యూ ఇయర్ రోజున ట్విట్టర్ ద్వారా పంచుకున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలను పట్టించుకోవట్లేదని మరీ ముఖ్యంగా రాజకీయంగా పదవులు, ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయన్న వార్తలు కోకొల్లులుగా వచ్చాయి. ప్రతిరోజూ దినపత్రికల్లో, టీవీ చానెల్స్, వెబ్ సైట్లల్లో ఇలాంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. దీంతో నాటి నుంచి నేటి వరకూ నేరుగా కలుసుకున్న సందర్భాల్లేవు. ఆఖరికి తండ్రి వైఎస్సార్ జయంతి, వర్ధంతి రోజున కూడా ఇడుపులపాయలో వేర్వేరు సమయాల్లో నివాళులు అర్పించిన పరిస్థితులున్నాయ్. ఇలా చాలా రోజుల తర్వాత షర్మిల-జగన్ భేటీ కాబోతుండటంతో అటు వైసీపీ.. ఇటు వైఎస్సార్టీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. షర్మిల ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీలో విలీనం తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల పాత్రేంటన్నది తెలియనుంది. దీంతో తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని షర్మిలతో రాయబారం నడిపారనే వార్తలు రావడం.. అదంతా ఫేక్ అని సుబ్బారెడ్డి స్పందించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో షర్మిల తాడేపల్లిలో జగన్‌ను కలవబోతున్నారు.మరోవైపు.. జగన్‌తో నేరుగా భేటీ జరగకపోవచ్చనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. మొత్తానికి చూస్తే బుధవారం నాడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామమే జరగబోతోంది. భేటీలో ఏం జరుగుతుందో..? భేటీ తర్వాత షర్మిల మీడియాతో ఏం మాట్లాడుతారో..? వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి..


YS Sharmila : వైఎస్ షర్మిల ఏపీకి వెళ్తే పరిస్థితేంటి.. సీఎం జగన్ బంపరాఫరిచ్చారా..!?


YSRCP : వైసీపీ ఇంచార్జుల రెండో జాబితా వచ్చేసింది..



Updated Date - Jan 02 , 2024 | 10:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising