Viral video : కోతులు దాడి చేస్తే, అలెక్సా సాయంతో బాలిక ప్రాణాన్ని కాపాడింది..!
ABN, Publish Date - Apr 06 , 2024 | 02:45 PM
ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది. వంట గదిలోకి వెళ్లి పాత్రలు, తినుబండారాలు ఏరుకుని విసరడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కోతి బీభత్సం సృష్టించడం చూసి బాలికలిద్దరూ భయపడ్డారు.
బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో 13 ఏళ్ల నికిత టెక్నాలజీని ఉపయోగించి ఓ అమాయక బాలిక ప్రాణాలను కాపాడింది. నికిత చేసిన ఈ ఫీట్ గురించి విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బస్తీలో సాంకేతిక పరిజ్ఞానంతో ఓ అమాయక బాలిక ప్రాణం కాపాడబడింది. నగరంలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీలో 13 ఏళ్ల నికిత ఇలాంటి సాహసం చేసి అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. నికిత చిన్న పిల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా ఆధునిక పరికరాలను ఉపయోగించడం ద్వారా ఎలాంటి సవాలునైనా అధిగమించవచ్చని తెలియపరిచింది. అసలు ఏం జరిగిందంటే..
ఆవాస్ వికాస్ కాలనీలోని పార్క్ సమీపంలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లిన నికిత తన 15 నెలల అక్కకూతురు వామికతో ఆడుకుంటుంది. ఇద్దరూ మొదటి అంతస్తులో వంటగది దగ్గర సోఫాలో కూర్చున్నారు. ఇంట్లో మిగిలిన వారంతా ఇతర గదుల్లో ఉన్నారు. అంతలోనే ఓ కోతి (monkey) ఇంట్లోకి ప్రవేశించింది.
వంట గదిలోకి వెళ్లి పాత్రలు, తినుబండారాలు ఏరుకుని విసరడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కోతి (monkey) బీభత్సం సృష్టించడం చూసి బాలికలిద్దరూ భయపడ్డారు. 15 నెలల వామికకు ఏమీ అర్థం కాలేదు కానీ భయపడి తల్లి కోసం ఏడవడం మొదులపెట్టింది. నికిత Nikita కూడా భయపడిపోయింది.
నికితా అలెక్సాకు ఈ కమాండ్ ఇచ్చింది.
కోతి చాలాసార్లు వారిద్దరి వైపు పరుగెత్తిందని నికిత చెప్పింది. అప్పుడు నికితకు ఫ్రిజ్‌పై ఉంచిన అలెక్సా పరికరం గుర్తుకువచ్చింది. అలెక్సాకి కుక్క శబ్దం చేయమని గట్టిగా చెప్పింది. అలెక్సా వాయిస్ కమాండ్ అందుకున్న వెంటనే, అది కుక్కలా మొరిగే శబ్దాలు చేయడం మొదులపెట్టింది.
మెదడులోని నరాలను దెబ్బతిన్నట్లుగా గుర్తించే సంకేతాలు ఇవే...!
కుక్క మొరిగే శబ్దం విన్న కోతి బాల్కనీ గుండా డాబా వైపు పరుగెత్తింది. అలెక్సాను ఇంత మంచి పద్ధతిలో ఉపయోగించుకోవచ్చని పిల్లకు తట్టడం చాలా మంచి విషయమని, సాంకేతికతను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని నికిత తెలీయజేసింది. దీనిమీద కుటుంబ పెద్ద పంకజ్ ఓజా కూడా ఆశ్చర్యపోయాడు.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
సాంకేతికతలో కొట్టుకుపోవడం కాకుండా ఇలా ఆపదలో ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా ఉపయోగించవచ్చి 13 ఏళ్ళ చిన్నరికి తెలియడం మంచిపరిణామంగా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
జుట్టుకు సహజంగా తయారు చేసుకున్న సిరమ్స్ ఎంతవరకూ మేలంటే..!
Updated Date - Apr 06 , 2024 | 02:45 PM