Viral: పోస్టు చేసిన 48 ఏళ్లకు వెనక్కొచ్చిన లేఖ! వృద్ధురాలికి సర్‌ప్రైజ్!
ABN, Publish Date - Oct 08 , 2024 | 07:29 AM
జాబ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ మహిళ పంపిన లేఖ ఏకంగా 48 ఏళ్ల తరువాత వెనక్కు వచ్చిన వింత ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది. పోస్ట్ ఆఫీసు వారి తప్పిదం కారణంగా తనకు ఆ ఉద్యోగం దక్కకపోయినా ఆ లేఖ చూసుకుని వృద్ధురాలు పాత జ్ఞాపకాల్లో మునిగితేలింది. పాత రోజుల్ని తలుచుకుంటూ మురిసిపోయింది .
ఇంటర్నెట్ డెస్క్: జాబ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ మహిళ పంపిన లేఖ ఏకంగా 48 ఏళ్ల తరువాత వెనక్కు వచ్చిన వింత ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది. పోస్ట్ ఆఫీసు వారి తప్పిదం కారణంగా తనకు ఆ ఉద్యోగం దక్కకపోయినా ఆ లేఖ చూసుకుని వృద్ధురాలు మురుసిపోయింది. పాత జ్ఞాపకాల్లో మునిగితేలింది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..
టిజీ హడ్సన్‌కు సినిమాల్లో స్టంట్లు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కల. మహిళలకు అప్పట్లో ఈ రంగంలో అవకాశాలు లేవని తెలిసినా ఆమె ప్రయత్నాలు ఆపలేదు. ఈ క్రమంలో స్టంట్ వుమన్ కావాలన్న ప్రకటన చూసి ఆమె వారికి లేఖ రాసింది. ప్రత్యుత్తరం కోసం ఎన్నో రోజులు ఎదురు చూసింది. కానీ, జవాబు రాకపోవడంతో ఆమె ప్రత్యామ్నాయ కెరీర్ ఎంచుకుని మంచి విజయాలు అందుకుంది.
Viral: వామ్మో.. కోతి ముందు ‘జై శ్రీరామ్’ అంటే ఇలా జరుగుతుందా!? వైరల్ వీడియో
తొలుత ఆమె ఆఫ్రికాకు వెళ్లి అక్కడ గుర్రాలు, పాములు వంటి జంతువుల హ్యాండ్లర్‌గా పనిచేసింది. చివరకు ఎయిరోబ్యాటిక్ పైలట్‌గా, ఇన్‌స్ట్రక్టర్‌గా స్థిరపడింది. అప్పట్లో తాను మహిళ అని ఎవరికీ తెలీకుండా ఉండేందుకు చాలా తాపత్రయపడేదాన్నని ఆమె పేర్కొంది. తన శరీరంలో ఎన్ని ఎముకలు విరిగిపోయినా ఏమీ పరవాలేదంటూ ఇంటర్వ్యూల్లో మూర్ఖంగా చెప్పుకొచ్చేదాన్నంటూ ఆమె నవ్వింది.
దాదాపు 50 ఏళ్ల క్రితం రాసిన ఆ లేఖ అనూహ్యంగా మళ్లీ తన చేతుల్లో చూసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. ఓ సొరుగు లోపల ఎక్కడో ఉన్న లెటర్‌ను తాము ఇన్నాళ్లూ గుర్తించలేకపోయామని పోస్టాఫీసు వాళ్లు తెలిపారు. లేఖ అందించడంలో కేవలం 48 ఏళ్లే ఆలస్యమైందంటూ చమత్కరించారు. ఇక లేఖ చూసుకుని పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ వృద్ధురాలు సంబరపడిపోయింది.
Viral: ఈ వీధి వ్యాపారి ముందు టెకీలు కూడా దిగదుడుపే! ఇతడి రేంజ్ ఏంటో చూస్తే..
అప్పట్లో ప్రత్యుత్తరం కోసం రోజుల తరబడి ఆశగా ఎదురు చూశానని ఆమె చెప్పుకొచ్చింది. ప్రతి రోజూ వెళ్లి పోస్టు డబ్బాలో లెటర్ వచ్చిందేమోనని చూసుకునేదాన్నని గుర్తు చేసుకుంది. కానీ తన లైఫ్ ఆశించిన విధంగానే గడిచిందని, అనుకున్న రీతిలో కెరీర్ ముందుకు సాగిందని చెప్పుకొచ్చింది. మరో ఛాన్స్ అంటూ ఉంటే ఇలాగే తన జీవితం కొనసాగిస్తానని వివరించింది. కాగా, ఈ ఉదంతం బ్రిటన్‌లోనే కాకుండా నెట్టింట్లో కూడా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే, పోస్టాఫీసు వారి పొరపాటు కారణంగా మహిళ ఓ అమూల్య అవకాశాన్ని కోల్పోయి ఉండొచ్చని కొందరు కామెంట్ చేశారు.
Viral: రూ.27 వేలకే ఐఫోన్ 16 కొనుక్కుని.. చివరకు విచారం! అసలేమైందంటే..
Updated Date - Oct 08 , 2024 | 07:37 AM