Odisha: నిరుద్యోగులను నిండా ముంచేశాడుగా! ఏకంగా రూ.2 కోట్లు దోచేసిన వైనం
ABN, Publish Date - Apr 25 , 2024 | 05:39 PM
ఐదవ తరగతి వరకే చదివిన ఓ నిందితుడు మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. నిరుద్యొగులకు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాల పేరిట రూ.2 కోట్ల మేర టోపీ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐదవ తరగతి వరకే చదివిన ఓ నిందితుడు మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. నిరుద్యొగులకు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాల పేరిట రూ.2 కోట్ల మేర టోపీ పెట్టాడు. పాపం పండటంతో చివరకు పోలీసులకు చిక్కాడు. ఒడిశాలో (Odisha) ఈ ఘటన వెలుగు చూసింది.
బాధితుల కథనం ప్రకారం, నిందితుడు రమేశ్ పాథీది బాలాసోర్ జిల్లాలోని సోరో ప్రాంతం. ఐదవ తరగతి చదివిన అతడు నిరుద్యోగుల ఆశలే పెట్టుబడిగా చెలరేగిపోయాడు. ప్రభుత్వం, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల్లో ఉద్యోగాల ఆశ చూపి అనేక మంది వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఒక్కొక్కరి నుంచీ రూ.3 లక్షల చొప్పున సుమారు 60 మంది నుంచి రూ. 2 కోట్ల వరకూ వసూలు చేశాడు. హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి నకిలీ నియామక పత్రాలు చూపించి నట్టేట ముంచాడు (5th Pass fraudster dupes job aspirants of over Rs 2 crore in Balasore).
Odisha: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు: మరోవైపు ఎదురు కాల్పులు
‘‘రమేశ్ మా నుంచి లక్షల రూపాయలను ఉద్యోగాల పేరిట కాజేశాడు. వైన షాపు ఓనర్ షిప్ ఇప్పిస్తానని చెప్పి నా నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు మోసం చేశాడు. ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దని కూడా బెదిరించాడు’’ అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రమేశ్‌పై కేసు నమోదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగం, ఉపాధి పేరిట ఆశ చూపి నిందితుడు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రమేశ్‌ను అరెస్టు చేశాం. దర్యాప్తు ప్రారంభించాం’’ అని బాలాసోర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శశాంక శేఖర్ బ్యూరా పేర్కొన్నారు.
Updated Date - Apr 25 , 2024 | 05:48 PM