6 Seconds Kiss: ప్రతి భర్త 6 సెకెన్ల ముద్దు సూత్రాన్ని ఫాలో కావాలట.. ఇంతకీ ఇదేంటంటే..!
ABN, Publish Date - Jun 03 , 2024 | 11:50 AM
ముద్దును చాలామంది మాట్లాడకూడని విషయంగా చూస్తారు. కానీ వైద్య శాస్త్రంలో ముద్దుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ముద్దు పెట్టుకోవడం వల్ల హార్మోన్లు రిలీజ్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని అంటారు. అయితే ఇప్పుడు 6 సెకెన్ల ముద్దు సూత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముద్దును చాలామంది మాట్లాడకూడని విషయంగా చూస్తారు. కానీ వైద్య శాస్త్రంలో ముద్దుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ముద్దు పెట్టుకోవడం వల్ల హార్మోన్లు రిలీజ్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని అంటారు. అయితే ఇప్పుడు 6 సెకెన్ల ముద్దు సూత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రతి భర్తా దీన్ని అనుసరించాలని, ఇలా చేస్తే ఆ భార్యాభర్తల మధ్య బంధం పదిలంగా ఉంటుందని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. అసలు ఈ 6 సెకెన్ల ముద్దు సూత్రం ఏంటో తెలుసుకుంటే..
తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
ప్రతి భర్త ఉద్యోగ నిమిత్తం లేదా వృత్తి నిమిత్తం రోజూ ఇంటి నుండి బయటకు వెళ్లడం మామూలే. తన విధులు పూర్తీ చేసుకున్న తరువాతే మళ్లీ ఇంటికి వస్తారు. అయితే భర్త ఇలా బయటకు వెళ్లే ముందు తన భార్యకు 6 సెకెన్ల పాటూ ముద్దు పెట్టుకోవడం వల్ల వారిద్దరి మధ్య బంధం చాలా దృఢంగా మారుతుందట. అసలు 6 సెకెన్లు మాత్రమే ఎందుకు నిర్ణయించారనే సందేహం అందరికీ వస్తుంది. నిజానికి మగవారి కంటే మహిళలు భార్యాభర్తల మధ్య సంబంధం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బంధం ఎక్కడ బలహీనపడుతుందో అనే ఆందోళన వారిలో ఉంటుంది. కానీ భర్త తను ఉద్యోగానికి వెళ్ళేముందు 6 సెకెన్ల పాటూ తన భార్యను పెదవి ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది భార్య మనసులో మానసిక భద్రత ఇస్తుందట.
ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!
6 సెకెన్ల పాటూ భార్యకు ముద్దు పెట్టడం వల్ల భార్య మనసులో ఏదైనా బాధ, తమ బంధం విషయంలో అభద్రతా భావం వంటివి ఉంటే అవన్నీ మాయమవుతాయట. అంతే కాదండోయ్.. ముద్దుకు 6 సెకెన్లు టైం సెట్ చేసినట్టే కౌగిలింతకు కూడా టైమ్ సెట్ చేశారు. 20 సెకెన్ల పాటూ భార్యను కౌగిలించుకోవడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. నిజానికి ఆక్సిటోసిన్ అనేది ప్రేమ హార్మోన్. దీన్ని కడల్ కెమికల్ అని కూడా పిలుస్తారు. ఒకరిని కౌగిలించుకున్నప్పుడు, ఉద్వేగానికి లోనైనప్పుడు ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో ముఖ్యం.
ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!
తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 03 , 2024 | 11:50 AM