Viral: అద్దె ఇళ్లకు ఇంత కరువొచ్చిందా! కేవలం బాల్కనీ రెంట్ రూ.81 వేలు
ABN, Publish Date - Jul 08 , 2024 | 03:14 PM
సిడ్నీలో ఓ ఫ్లాట్ బాల్కనీని రూ.81 వేలకు అద్దెకు ఇస్తాంటూ ఓ వ్యక్తి ప్రకటన ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాల్కనీ రేటే ఇంతలా ఉంటే ఇక మొత్తం ఇల్లు అద్దె ఏ స్థాయిలో ఉంటుందో అని జనాలు నోరెళ్లబెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అది కేవలం బాల్కనీ మాత్రమే. అందులో ఓ బెడ్డు. ఓ అద్దం.. దీన్ని రెంటుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారో వ్యక్తి. అద్దె మాత్రం రూ.81 వేలు చెబుతున్నారు. ఇదంతా జోక్ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో వెలుగు చూసిందీ ఘటన. సదరు వ్యక్తి ఇచ్చిన యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
సిడ్నీలో ఉండే ఓ వ్యక్తి ఈ యాడ్ ఇచ్చారు. తానుండే ఫ్లాట్‌కు అనుబంధంగా ఉన్న బాల్కనీని అద్దెకు ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. బాల్కనీలో బెడ్డు ఉంటుందట. బోలెడంత వెలుతురు కూడా ఉంటుందట. కాలకృత్యాల కోసం తన గదిలో ఉన్న బాత్రూమ్‌ను వాడుకోవచ్చట. అద్దె మాత్రం నెలకు రూ.81 వేలని (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే) వివరించాడు. అయితే, కరెంటు, వాటర్ బిల్లు మాత్రం అదనమట. ఇలా తన బాల్కనీ గొప్పతనాన్ని చెప్పుకుపోయాడా వ్యక్తి.
Viral: అత్త ముందే భర్తకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మహిళ! చూస్తే షాకవ్వాల్సిందే
రూ.81 వేల అద్దె ఇల్లు అంటే కనీసం మూడు నాలుగు బెడ్ రూంలు ఉండాలని ఎవరైనా ఆవిస్తారు. కానీ ఒక్క బాల్కనీని ఈ రేటుకు అద్దెకు ఇస్తానంటూ ధైర్యంగా యాడ్ ఇవ్వడం జనాలను తెగ ఆశ్చర్యపరుస్తోంది. ఇదేమైనా జోకా లేక నిజమా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. సిడ్నీలో పరిస్థితి మరీ ఇంతలా దిగజారాయా? అద్దె ఇళ్లకు మరీ అంత కరువొచ్చిందా అని ప్రశ్నించారు.
అయితే నగరంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. ఆర్థిక రంగం పుంజుకోవడం, జనాభా పెరుగుదల వంటివన్నీ ఇళ్లకు డిమాండ్ పెంచి అద్దెలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి. దీంతో, మధ్యతరగతి వారు నరకయాతన అనుభవిస్తు్న్నారు. ఆదాయంలో అధికశాతం అద్దెలకు పోతుండటంతో ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్నారు.
Updated Date - Jul 08 , 2024 | 03:17 PM