ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: పెళ్లి చేసుకునేందుకు 2 రోజులు సెలవు అడిగితే తిరస్కరించిన సీఈవో.. కారణం ఏంటో తెలుసా?

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:27 PM

ఓ ఉద్యోగి తన పెళ్లి కోసం 2 రోజులు సెలవులు అడిగితే కంపెనీ సీఈవో తిరస్కరించారు. లీవ్స్ ఇవ్వను గాక ఇవ్వనని తెగేసి చెప్పారు. బ్రిటన్‌కు చెందిన ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చూసుకుంటున్న లారెన్ టిక్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఉద్యోగి తన పెళ్లి కోసం 2 రోజులు సెలవులు అడిగితే కంపెనీ సీఈవో తిరస్కరించారు. లీవ్స్ ఇవ్వను గాక ఇవ్వనని తెగేసి చెప్పారు. బ్రిటన్‌కు చెందిన ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చూసుకుంటున్న లారెన్ టిక్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనకగల కారణాలను ఆమె స్వయంగా సమర్థించుకున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతున్న వేళ ఆమె పోస్టు సంచలనంగా (Viral) మారింది. జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వారు దుమ్మెత్తిపోస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉద్యోగి తన పెళ్లికి సెలవు అడిగితే తాను తిరస్కరించానంటూ టిక్నర్ పెట్టిన పోస్టు పెను కలకలానికి దారి తీసింది. సదరు ఉద్యోగి రెండు రోజుల సెలవు అడిగారని కూడా ఆమె తెలిపింది. అయితే.. సెలవు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో కూడా ధైర్యంగా వివరించింది. ఆమె తెలిపిన దాని ప్రకారం, అంతకుముందే ఈ ఉద్యోగి రెండున్నర వారాల సెలవు తీసుకున్నారు. తన గైర్హాజరీలో ఆ బాధ్యతలు నిర్వహించేందుకు మరో వ్యక్తిని ఎంపిక చేసి తగు తర్ఫీదు ఇవ్వాల్సి ఉండగా అది కూడా చేయలేదు. అప్పటికే ముఖ్యమైన ప్రాజెక్టుల డెడ్‌లైన్స్ సమీపిస్తుండటంతో తాను సెలవు ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చింది.

Viral: కన్నబిడ్డ ప్రాణాలతో చెలగాటం! వ్యూస్ కోసం ఇంత కక్కుర్తా..


ఈ పోస్టు చదివిన జనాలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇదేం దారుణమని దుమ్మెత్తిపోశారు. దీంతో, సదరు సీఈఓ మరో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ సంస్థలో ఉద్యోగులకు సెలవుల విషయంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉందని, ఉన్నత స్థాయి అధికారుల అనుమతి లేకుండా కూడా సెలవు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఉద్యోగులు ముందుగా తాము లేని సమయాల్లో పని చేసేవారికి తర్ఫీదు నివ్వాలని చెప్పుకొచ్చారు. సదరు ఉద్యోగికి భవిష్యత్తులో ఎన్ని సెలవులైనా తీసుకునే స్వేచ్ఛ ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇది జనాలను మరింత తికమకపెట్టడంతో నెట్టింట కామెంట్‌ల వరద పారింది. నెటిజన్లు తమదైన శైలిలో సీఈఓతో చెడుగుడు ఆడుకున్నారు.

టిక్నర్ తీరు కంపెనీ విధానానికి విరుద్ధంగా ఉందని అనేక మంది దుమ్మెత్తిపోశారు. కొత్త ట్రెయినీలను ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వడం మేనేజర్ బాధ్యత అని, ఈ బరువు ఉద్యోగి మీద పెట్టడం సబబు కాదని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్ని సెలవులైనా తీసుకోవచ్చని ఓ వైపు అంటూనే మరోవైపు అత్యంత ముఖ్యమైన రోజు కోసం సెలవు లేదంటావా?’’ అని మరో వ్యక్తి నిలదీశాడు.


Viral: 300 మంది ఉద్యోగుల్ని కోటీశ్వరుల్ని చేసి.. విచారంలో కంపెనీ యజమాని! ఎందుకంటే..

‘‘పెళ్లికి రెండు రోజులు సెలవు తీసుకుంటే ఆ మేరకు మరో వ్యక్తి శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగించాలా? ఒక వ్యక్తి రెండు రోజులు లేకపోతే పని ఆగిపోతుందంటే మేనేజర్‌గా నీ నిర్వహణ సరిగా లేదని స్పష్టమవుతోంది’’ అని మరో వ్యక్తి మండిపడ్డారు. ఇదో మార్కెటింగ్ స్ట్రాటజీ అయ్యుంటుందని కొందరు సందేహం వెలిబుచ్చారు. జనాలను రెచ్చగొట్టి కామెంట్స్ వరద పారించేలా చేయడమే దీని వెనక లక్ష్యం అయ్యుండొచ్చని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: జర్మనీలో ఈ ఎన్నారైలు ఏం చేశారో చూడండి.. నెట్టింట తిట్ల వర్షం!

Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!

Read Latest and Viral News

Updated Date - Oct 21 , 2024 | 03:35 PM