ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: బాబోయ్ చార్మినార్‌పై ఏంటా సాహసం..

ABN, Publish Date - Oct 05 , 2024 | 01:42 PM

Viral Video: అనుకోకుండా తీసిన వీడియోలు కూడా అప్పుడప్పుడు తెగ వైరలవుతూ ఉంటాయి. అలాంటి వీడియోలు చూసి షాక్ అవడం నెటిజన్ల వంతవుతుంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో చారిత్రకట్టడం చార్మినార్ కనిపిస్తుంది.

A Man Dangerous Stunt At Charminar

ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది అదేపనిగా సోషల్ మీడియాలో వ్యూస్ పొందేందుకు చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. అంతేకాదు ఎక్కువ లైకులు పొందేందుకు ఎంతటి సాహసానికైనా దిగుతారు. అయితే అనుకోకుండా తీసిన వీడియోలు కూడా అప్పుడప్పుడు తెగ వైరలవుతూ ఉంటాయి. అలాంటి వీడియోలు చూసి షాక్ అవడం నెటిజన్ల వంతవుతుంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో చారిత్రకట్టడం చార్మినార్ కనిపిస్తుంది. ఓ వ్యక్తి దానిపై ఎక్కి చేసిన సాహసం గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం.

Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు


వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ వ్యక్తి చార్మినార్‌పైకి ఎక్కాడు. అంతేకాదండోయ్ ప్రమాదకరంగా నడిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. చార్మినార్ పైన ఉన్న అంతస్తుపైకి ఎక్కిన సదరు వ్యక్తి వెలుపలకు వచ్చి నడుస్తుంటాడు. ప్రమాదకరంగా ఒక కిటికీ నుంచి మరో కిటికీని అందుకునేందుకు వెళుతున్నాడు. ప్రమాదకరంగా రెండు కిటీకీలను దాటుకుని తీరిగ్గా అక్కడే సెటిలయ్యాడు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


అసలు ఆ వ్యక్తి ఎందుకు చార్మినార్ పైకి వెళ్లాడు?.. అలా ప్రమాదకరంగా నడవాల్సిన అవసరం ఏంటి?.. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇలా రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ప్రమాదకరంగా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అక్కడికి తరలివెళ్లే కార్మికుల్లో ఒకరు అలా వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా అలా చార్మినార్‌పై ప్రమాదకరంగా నడవడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అంటూ వారు ప్రశ్నలు కురిపిస్తున్నారు.

Youtuber Harsha Sai: హర్ష సాయి.. ఇక తప్పించుకోలేడు


సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం కొందరు ఇలా చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి సాహసం చేస్తున్నారు. తమపై ఆధారపడి ఉన్న కుటుంబం గురించి ఆలోచించడం లేదు. మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సాహసాలు చేయొద్దని పెద్దలు సూచిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు ఫీట్లు చేస్తున్నారు. అదేం లేదని, సదరు వ్యక్తి కార్మికుడు అని మరికొందరు అంటున్నారు. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

Gali Janardhan Reddy: మాజీమంత్రి ‘గాలి’ సంచలన వ్యాఖ్యలు.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..

Encounter: అబూజ్‌మడ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో తెలుగువారు.. ఎవరంటే

Read Latest prathyekam Videos And Telugu News

Updated Date - Oct 05 , 2024 | 01:44 PM