ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఘాటుగా స్పందించిన నెటిజన్లు.. ఏమైందంటే

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:04 PM

కొందరు తిన్నగా ఉండరు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం అంటే తెగ ఇష్టం. పబ్లిక్‌గా నాశనం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందుతాడు ఇతను. వందేభారత్ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్‌ కిటికీపై దాడి చేశాడు. అతని చేష్టలను వెనక నుంచి వీడియో తీశారు.

Man Smashing Windows

కొందరు తిన్నగా ఉండరు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం అంటే తెగ ఇష్టం. పబ్లిక్‌గా నాశనం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందుతాడు ఇతను. వందేభారత్ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్‌ కిటికీపై దాడి చేశాడు. అతని చేష్టలను వెనక నుంచి వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.



ఏం చేస్తున్నాడంటే..

సోషల్ మీడియా ఎక్స్‌లో గన్‌కాంచీ అనే యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. ఓ అనుమానాస్పద వ్యక్తి హమ్మర్ పట్టుకొని ఏం చేస్తున్నారో చూడండి అని క్యాప్షన్ రాశారు. ఘటన ఎక్కడ జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా..? అసలు అక్కడ ఏం జరిగిందని అడిగారు. చూడటానికి చక్కగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో తిలకించండి అని రాసుకొచ్చారు. కిటికీని ధ్వంసం చేసే వీడియోను వెనక నుంచి తీశారు. దాంతో సదరు వ్యక్తి మొహం కనిపించలేదు. ఆ ఘటనను నెటిజన్లు తప్పు పట్టారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



అరెస్ట్ చేయండి..

ఆ ఫొటో చూసి నెటిజన్లు స్పందించారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఒకరు.. అదుపులోకి తీసుకోవాలని మరొకరు. అతన్ని అదే రైలుకు కట్టి వేయాలని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇటీవల వందే భారత్ రైళ్లపై రాల్ల దాడులు జరిగాయి. దాంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. వాస్తవానికి అప్పగించిన పనిని అతడు చేశాడని తర్వాత తెలిసింది.



విషయం ఏంటంటే..?

ఆ రైలు స్టేషన్‌లో లేదని, సర్వీస్ సెంటర్‌లో ఉందని ఒకరు సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి హమ్మర్‌తో కిటికీ తొలగిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ చోట పెట్టాల్సిన విండో కోసం తొలగిస్తున్నాడని రాసుకొచ్చారు. ఆ పని చేసేది వర్కర్ అని, చెప్పిన పనిని అతను చేస్తున్నాడని స్పష్టం చేశారు. ఆ ఫొటో వెనక నుంచి తీయడంతో పొరపాటు జరిగింది. అతను కావాలనే కిటికీని ధ్వంసం చేస్తున్నాడని అంతా ఊహించారు. అది నిజం కాదు. దాంతో తప్పుగా అపార్థం చేసుకున్నారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 10 , 2024 | 09:04 PM

Advertising
Advertising