IRCTC: ఇదేం తీరు.. ప్లాట్‌ఫామ్ క్యాంటీన్‌లో ఎలుకలు.. అధికారుల తీరుపై ప్యాసింజర్స్ ఫైర్..
ABN, Publish Date - Jan 09 , 2024 | 01:03 PM
రోజుకు లక్షలాది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వేలు కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
రోజుకు లక్షలాది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వేలు కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్యాసింజర్స్‌కు టికెట్స్, కేటరింగ్ సేవలను ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకెళ్తుంటారు. మరికొందరు మాత్రం రైళ్లల్లో ఫుడ్ వెండర్స్ నుంచి కొనుగోలు చేస్తారు. నాణ్యత సంగతి తెలిసిందే అయినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో తినేస్తుంటాం. కాగా.. ప్రస్తుతం ఐఆర్సీటీసీ స్టాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫుడ్ కోర్టులో ఎలుకలు తిరగడాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వైరల్‌గా మారిన వీడియోను "ట్రైన్ వాలే భయ్యా" అనే పేరుకు ట్యాగ్ చేశారు. భోపాల్ డివిజన్ లోని ఓ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ఉన్న స్నాక్స్, ఫుడ్ కంటైనర్ ప్లేట్లలో ఎలుకలు స్వైర విహారం చేశాయి. అక్కడే ఉన్న సౌరభ్ అనే ప్రయాణికుడు ఈ సీన్ చూసి షాకయ్యారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకండా వెంటనే వీడియో తీశాడు. "నేను రైల్వే స్టేషన్ క్యాంటీన్లల్లో ఆహారం తినకుండా ఉండటానికి కారణం ఇదే" అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. దీంతో ఈ వీడియో వెంటనే వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న వీడియోపై రైల్వే అధికారులు స్పందించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భోపాల్ డివిజన్‌కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్ సైతం ఈ పోస్ట్ పై స్పందించారు. సమస్యను పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 09 , 2024 | 01:09 PM