ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:42 PM

సాధు జంతువులను ఏం చేసినా.. కవ్వించినా అవి ఏం చేయ్యవు. అదే పులి, సింహం, చిరుత లాంటి జీవులను కవ్విస్తే ఏం చేస్తాయో. అందరికి తెలిసిందే. ఇంకా సోదాహరణగా తెలియాలంటే మాత్రం.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు ముగ్గురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో వారికి కొంత దూరంలో చిరుతపులి కనిపించింది. దానిని తమ సెల్ ఫోన్‌లో వీడియో తీస్తూ.. రా.. రా.. రా అంటు గట్టిగా చిరుతపులిని కవ్వించారు. దీంతో చిరుత పులి ఒక్క సారిగా వారివైపు వాయువేగంతో దూసుకు వచ్చింది. ఇది ఏ మాత్రం ఊహించని వారు... ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతే భయంతో వారు పరుగు తీశారు.

Also Read: ఇవి తింటే.. జుట్టు ఊడదు..


అయినా చిరుత వారిని వదుల లేదు. వారిపై బలంగా దాడి చేసి తీవ్రంగా వారిని గాయపరిచింది. అంతలో అక్కడే ఉన్న పలువురు యాత్రికులు బిగ్గరగా అరవడంతో.. చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు.. ముగ్గురు యువకులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ఆదివారం మధ్యప్రదేశ్‌లో దక్షిణ అటవీ ప్రాంతంలోని షాడోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.


మరోవైపు చిరుతపులి ఒక యువకుడిపై దాడి చేసిన ఘటన మాత్రమే ఈ వీడియోలో నిక్షిప్తమైంది. ఈ ఘటనపై సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారి బాద్ షా రావత్ స్పందించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో వ్యక్తిపై పులి దాడి చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పర్యటించవద్దని యాత్రికులకు సూచించామన్నారు. అలాగే షాదోల్ ప్రాంతంలోని గ్రామస్తులకు, ప్రజలకు కూడా సూచించినట్లు చెప్పారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశ్యంతో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేసినట్లు సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారి బాద్ షా రావత్ స్పష్టం చేశారు.


30 సెకన్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. విహార యాత్రకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని యాత్రికులకు నెటిజన్లు సూచిస్తున్నారు. అదే అటవీ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు అంటున్నారు. అలాంటి వేళ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. దారుణమైన సంఘటనలు ఎదుర్కొవలసి ఉంటుందని వారు వివరిస్తున్నారు.


అందుకు ఈ ముగ్గురు విహారయాత్రికులపై దాడి ఘటనే అందుకు ఉదాహరణ అని నెటిజన్లు ఈ సందర్బంగా స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో ఇతర విహారయాత్రికులు బిగ్గరగా అరవడం వల్ల.. చిరుత అక్కడి నుంచి పారిపోయిందని వారు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ ముగ్గురు ప్రాణాలతో జీవించి ఉన్నారని నెటిజన్లు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 22 , 2024 | 04:12 PM