ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కోల్ కతా వీధుల్లో పవర్ ఫుల్ డ్యాన్స్

ABN, Publish Date - Sep 17 , 2024 | 08:53 PM

కోల్ కతా వైద్యురాలి మృతిని నిరసిస్తూ బెంగాలి నటి, మోక్షా సేన్ గుప్తా కోల్ కతా వీధుల్లో పవర్ ఫుల్ డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ చూసి స్థానికులు ఆశ్చర్య పోయారు.

Actor Mokksha

కోల్ కతాలో వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సబ్బండ వర్గాలు గొంతెత్తి నినాదిస్తోన్నాయి. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఓ నటి డ్యాన్స్ చేసి మరి నిరసన తెలియజేశారు. ఆ డ్యాన్స్ ఆలోచింప జేసేట్టు ఉంది. ఆవేశంతో డ్యాన్స్ చేసి నిరసనను తెలిపారు నటి మోక్షా సేన్ గుప్తా.


సూపర్..

ఓ స్వచ్చంద సంస్థ దక్షిణ కోల్ కతాలో ప్రదర్శన చేపట్టింది. వారితో నటి, డ్యాన్సర్ మోక్షా సేన్ గుప్తా జత కలిశారు. ఘటనను ఖండిస్తూ మోక్ష చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఆ ప్రదర్శనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. ఘటనపై నటి తనదైన శైలిలో నిరసన తెలియజేశారని ప్రశంసిస్తున్నారు. ఆ డ్యాన్స్ వల్ల మరింత మందిలో నూతనోత్తేజం వస్తోందని మరొకరు కామెంట్ చేశారు.



ఓ కళాకారిణిగా

ఉత్తర 24 పరగణల జిల్లాకు చెందిన మోక్షా సేన్‌గుప్తా టీచర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత నటన వైపు దృష్టిసారించారు. బెంగాలీ సినిమాల్లో నటించారు. తర్వాత దక్షిణ భారత సినీ పరిశ్రమ వైపు చేశారు. ఘటన జరిగిన సమయంలో హైదరాబాద్‌లో ఉన్నానని, విషయం తెలిసిన వెంటనే బెంగాల్ వచ్చానని మోక్షా వివరించారు. ఓ కళాకారిణిగా నిరసన తెలియజేశానని పేర్కొన్నారు. కళ ద్వారా సమస్యను వివరించే ప్రయత్నం చేశానని తెలిపారు.నీతోనే నేను, అలనాటి రామచంద్రుడు, ఐ హేట్ యూ సినిమాల్లో నటించారు.


ఉరే సరి..

కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే మానవ మృగం లైంగిక దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. అతనితోపాటు ఇతరులు కూడా ఉన్నారని ఆ వైద్యురాలి పేరంట్స్ ఆరోపిస్తున్నారు. దారుణానికి ఒడిగట్టిన అందరిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యురాలి మృతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలియజేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం

Updated Date - Sep 17 , 2024 | 09:10 PM

Advertising
Advertising