ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..

ABN, Publish Date - Dec 13 , 2024 | 10:02 PM

సినిమాలు, మ్యూజిక్ కాన్సర్టులకు ఎక్కువగా వెళ్లేవారి కోసం ఓ అడల్ట్ డైపర్ మార్కెట్లో విడుదలైంది. దీన్ని చూసి జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సినిమా హాల్‌లో తెరపై దృశ్యాలు చూస్తూ మైమరిచిపోతున్న తరుణంలో మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే ఎవరికైనా ఇబ్బందే. ఉత్కంఠ భరిత సన్నివేశాలు మిస్సవ్వొచ్చనే భయంతో అనేక మంది తమ సీట్లల్లోంచి కదలరు. వీలైనంత వరకూ మూత్రవిసర్జను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తారు. తమకు నచ్చిన నటీనటుల సినిమాలు చూసేవారు, పాప్‌స్టార్ల మ్యూజిక్ కన్సర్టుకు వెళ్లేవారు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. అయితే, ఓ రెండు సంస్థలు ఈ ఇబ్బందికర పరిస్థితికి తమ వద్ద పరిష్కారం ఉందని అంటున్నాయి (Viral).

Viral: కస్టమర్ ఆగ్రహం! కొత్త కారుతో షోరూమ్‌ను ఢీకొట్టిన వైనం!


సినీప్రియులు, మ్యూజిక్ ప్రేమికులు ఉన్న చోట నుంచి కదలకుండానే మూత్రవిసర్జన చేసేందుకు వీలుగా లిక్విడ్ డెత్, డిపెండ్ అనే రెండు సంస్థలో ఓ అడల్ట్ డైపర్‌ను రూపొందించాయి. తరచూ సినిమాలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లకు వెళ్లేవారికోసమే తాము వీటిని డిజైన్ చేసినట్టు ఈ రెండు కంపెనీలు చెప్పుకొచ్చాయి. అన్నట్టు ఒక్కో అడల్ట్ డైపర్ ధర ఏకంగా రూ.6 వేలు.

తాము రూపొందించిన డైపర్‌లో మాత్రం అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ఈ రెండు సంస్థలు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇది వేసుకున్నా ఉన్నచోటనే ఎటువంటి ఇబ్బందీ లేకుండా మూత్ర విసర్జన చేయొచ్చట. ఒక్క చుక్క కూడా బయటకు లీక్ కాదట. అంతేకాదు, ఎంతటి నీటినైనా పీల్చుకునే ఈ డైపర్లలో దుర్వాసనను అడ్డుకునే లా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి. ఇవి తొడుక్కు్న్నాక పలుమార్లు వాష్‌రూంకు వెళ్లా్ల్సిన అగత్యం తప్పుతుందని చెబుతున్నాయి.

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు


ఇక తమ ఉత్పత్తి జనాలకు ఎంత ఉపయెగకరమో చెబుతూ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసుకున్నాయి. జనాలకు కూడా ఈ ఐడియా బాగా నచ్చడంతో ఆన్‌లైన్‌లో అనేక మంది ఇబ్బడిముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో, వారి వద్ద ఉన్న స్టాక్ మొత్తం నిండుకోవడంతో ఇక మా వద్ద ఏమీ లేవంటూ వారు వెబ్‌సైట్ ద్వారా ప్రకటించారు. మళ్లి కొత్తవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా చెప్పలేమని అన్నారు.

కాగా, ఈ ఉదంతంపై నెట్టింట కూడా భారీ స్పందన వస్తోంది. అనేక మందికి ఈ ఐడియా నచ్చింది. కొందరు మాత్రం జోకులు పేల్చారు. ఈ డయపర్లకు డిమాండ్ పెరిగితే మాత్రం ఇకపై ప్రతి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దుర్వాసనలు పెరిగిపోతాయని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండ్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Dec 13 , 2024 | 10:04 PM