Viral: ఓలా క్యాబ్ బుక్ చేయగానే వచ్చిన మెసేజ్ చూసి షాక్.. వెంటనే రైడ్ క్యాన్సిల్ చేసిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Jul 05 , 2024 | 02:02 PM
డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. మనకు అవసరమైనవన్నీ కాళ్ల దగ్గరకు వస్తున్నాయి. ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు లేదా ఆటో కోసం రోడ్డు మీద పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఓలా లేదా ఉబర్ ద్వారా బుక్ చేస్తే చాలు.. క్యాబ్ నేరుగా ఇంటికే వచ్చి ఆగుతుంది.
డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. మనకు అవసరమైనవన్నీ కాళ్ల దగ్గరకు వస్తున్నాయి. ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు లేదా ఆటో కోసం రోడ్డు మీద పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఓలా (OLA) లేదా ఉబర్ ద్వారా బుక్ చేస్తే చాలు.. క్యాబ్ (Cab) నేరుగా ఇంటికే వచ్చి ఆగుతుంది. అయితే ఇలాంటి క్యాబ్ బుకింగ్ సమయాల్లో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా బెంగళూరు (Bengaluru)లో ఓ వినియోదారుడికి ఎదురైన అనుభవం వింటే నవ్వాపుకోలేరు (Viral News).
timepassstruggler అనే ఇన్‌స్ట్రాగామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఓలా ద్వారా క్యాబ్ బుక్ చేశారు. సాధారణంగా క్యాబ్ బుక్ చేయగానే డ్రైవర్ పేరుతో ఓ మెసేజ్ వస్తుంది. ఆ వ్యక్తికి కూడా అలాగే వచ్చింది. ``యమరాజ్ మీ లోకేషన్‌కు వచ్చి వెయిట్ చేస్తున్నాడు`` అంటూ మెసేజ్ వచ్చింది. డ్రైవర్ పేరు యమరాజ్ (Yamaraja)అని చూసి ఆ కస్టమర్ షాకయ్యాడు. ఎందుకైనా మంచిదని ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేశాడు. ఈ ఫన్నీ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫన్నీ పోస్ట్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస వచ్చాయి. దాదాపు 8 లక్షల మంది ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``రైడ్ క్యాన్సిల్ చేయడానికి సరైన రీజన్``, ``ఆ డ్రైవర్ పేరు వై.అమర్ రాజా అయ్యుంటుంది``, ``చాలా తెలివైన నిర్ణయం``, ``నాకు గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 05 , 2024 | 02:02 PM