ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: డేటింగ్ చేద్దామంటూ మూడేళ్ల తర్వాత యువతికి మెసేజ్ పంపాడు.. చివరకు ఆమె చెప్పింది విని ఖంగుతిన్నాడు.

ABN, Publish Date - Oct 06 , 2024 | 06:42 PM

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ యువతిని చూసి యువకుడు.. ఆమెతో డేటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ‘‘నీకు ఇష్టమైతే.. నాకు నీతో డేటింగ్ చేయాలని ఉంది’’.. అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే..

ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు డేటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకవేళ ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోతే ఎవరి ఇష్టం ప్రకారం వారు వెళ్లిపోవడం చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు చోటు చేసుకునే ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఓ యువతికి మూడేళ్ల తర్వాత.. డేటింగ్ చేద్దామంటూ మెసేజ్ చేసి గుర్తు చేశాడు. అయితే చివరకు ఆమె నుంచి వచ్చిన సమాధానం విని అవాక్కయ్యాడు.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతిని చూసి యువకుడు.. ఆమెతో డేటింగ్ (Dating) చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ‘‘నీకు ఇష్టమైతే.. నాకు నీతో డేటింగ్ చేయాలని ఉంది’’.. అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ఇందుకు ఆమె నిరాకరించింది. ‘‘నాకు ఇష్టం లేదు.. మూడేళ్ల తర్వాత గుర్తు చేయ్.. ఆలోచిస్తా’’.. అని సమాధానం ఇచ్చింది.

Viral Video: ప్రియుడి ఆచూకీ చెప్పాలంటూ యువకుడిని బెదిరించిన యువతి.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఆమె చెప్పిన మాటను ఆ వ్యక్తి చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమె చెప్పినట్లుగానే మూడేళ్ల వరకూ ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఆమెకు మెసేజ్ చేసి గుర్తు చేశాడు. ‘‘మూడేళ్ల క్రితం డేటింగ్ చేద్దామని అడిగితే.. మూడేళ్ల తర్వాత గుర్తు చేయమన్నావ్.. అందుకే చేస్తున్నా.. నీకు ఇష్టమైతే డేటింగ్ స్టార్ట్ చేద్దాం’’.. అంటూ ఆమెకు మెసేజ్ చేశాడు. అయితే ఆమె.. ‘‘నాకు వివాహం అయిపోయింది. ప్రస్తుతం పారిస్‌లో ఉంటున్నా. త్వరలో కవల పిల్లలకు తల్లి కూడా అవుతున్నా’’.. అని సమాధానం ఇచ్చింది.

Viral Video: వామ్మో.. వీడేంట్రా.. మరీ ఇలా ఉన్నాడు.. రోటీ మధ్యలో పేడ ఉంచి మరీ..


సదరు యువతి ఇచ్చిన ఆ రిప్లై చూడగానే యువడికి గుండె ఆగినంతపనైంది. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు్ చేశాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. బ్రదర్.. నీకు ఎంత అన్యాయం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘మూడేళ్లు ఎదురుచూపులకు దక్కిన ఫలితం’’.. అంటూ మరికొందరు, ‘‘ఆమె అబద్ధం చెప్పి ఉండొచ్చు అనిపిస్తోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లు, 21 మిలియన్ల వ్యూస్‌ను సొంత చేసుకుంది.

Viral Video: లారీనే ఢీకొట్టాలని చూసిన ఖడ్గమృగం.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2024 | 06:42 PM